హైదరాబాద్ రాజేంద్రనగర్(Rajendranagar Accident) పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. పిల్లర్ నెంబర్ 253 సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.
Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..
అపఘాతం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఉప్పర్‌పల్లి(Upparpally) నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమంగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: