Rajendranagar Accident: పీవీ ఎక్స్‌ ప్రెస్‌ వేపై మూడు కార్లు ఢీ.. భారీ ట్రాఫిక్ జామ్

Read Time:  1 min
Rajendranagar Accident
Rajendranagar Accident
FONT SIZE
GET APP

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌(Rajendranagar Accident) పరిధిలో పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై భారీ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మూడు కార్లు వరుసగా ఒకదానికొకటి ఢీకొన్నాయి. పిల్లర్‌ నెంబర్‌ 253 సమీపంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయాలపాలయ్యారు.

Read Also: AP Crime: రైలు ప్రమాదంలో నవ దంపతులు మృతి..

అపఘాతం కారణంగా పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాల రాకపోకలు తీవ్రంగా నిలిచిపోయాయి. ఉప్పర్‌పల్లి(Upparpally) నుంచి ఆరాంఘర్‌ చౌరస్తా వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రాఫిక్‌ను క్రమంగా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.