టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు మారుతి,దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ (Prabhas) హీరో గా నటిస్తున్నారు. మారుతి రూపొందిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ “రాజాసాబ్” (Raja Saab) ప్రేక్షకులలో అంచనాలను మరింత పెంచుతుంది. హార్రర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా, వినోదం, భయభ్రాంతిని సమానంగా అందించేలా రూపొందించబడింది.
ఈ సినిమాలో మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్, రిద్దికుమార్ ఫీ మెయిల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించారు. ఇది డార్లింగ్ కెరీర్ ఫస్ట్ రొమాంటిక్ హారర్ ఫాంటసీ కామెడీ మూవీ (Romantic horror fantasy comedy movie).
Movie: ఓడుమ్ కుతిర చాదుమ్ కుతిర (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ
అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన టీజర్, పోస్టర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దసరా కానుకగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే లాంచ్ చేసిన రాజాసాబ్ గ్లింప్స్ (Rajasaab Glimpses) లో ప్రభాస్ సూపర్ స్టైలిష్‌గా చేతిలో పూలబొకే పట్టుకొని అద్దంలో తనను తాను చూసుకుంటూ..
పూలు చల్లుతూ నయా లుక్‌లో కనిపిస్తూ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తున్నాడు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రాజాసాబ్‌లో సంజయ్ దత్ సంజూబాబా పాత్రలో కనిపించబోతున్నాడని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: