నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలతో కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచిన హీరోయిన్ ఈమె. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే పూనమ్.. తన దృష్టికి వచ్చిన విషయాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. అప్పుడప్పుడు వైరాగ్యంతో, ఎవరినో ఒకరిని పరోక్షంగా టార్గెట్ చేస్తున్నట్లుగా పోస్టులు పెడుతుంటారు. ఇప్పుడు లేటెస్టుగా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను ఉద్దేశిస్తూ పూనమ్ (Poonam Kaur) షాకింగ్ కామెంట్స్ చేశారు.
Read Also: Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా?
మహిళలను వేధిస్తూ
2001లో విడుదలై తెలుగు ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా రీ-రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ప్రమోషన్ కార్యక్రమంలో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడిన వీడియోపై పూనమ్ స్పందించారు. ఆ వీడియోలో త్రివిక్రమ్.. డబ్బు, కీర్తి కంటే గౌరవాన్ని తెచ్చిపెట్టే సినిమాల గురించి తాత్వికంగా మాట్లాడారు. దీనిపై స్పందిస్తూ పూనమ్ ఇంగ్లీషులో, “ఆయనో దుర్మార్గుడు.
మహిళలను మానసిక క్షోభకు గురిచేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోగలడు. ఎందుకంటే మీలాంటి మీడియా సంస్థలు, ‘మా’ అసోసియేషన్ అతనికి మద్దతిస్తున్నాయి. అతని లాంటి వారిని జవాబుదారీ చేయకుండా వదిలేస్తున్నాయి,” అని పోస్ట్ చేశారు. తెలుగులోనూ స్పందిస్తూ.. ఇలాంటి వ్యక్తులు మహిళలను వేధిస్తూ వారిని మానసికంగా కుంగదీస్తున్నారని, చిన్న చిన్న విషయాలకు స్పందించే ‘మా’ అసోసియేషన్ ఇలాంటి తీవ్రమైన అన్యాయాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: