📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: PM Modi – ప్రధాని మోదీ బర్త్ డే..సినీ ప్రముఖులు స్పెషల్ విషెస్

Author Icon By Anusha
Updated: September 17, 2025 • 3:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
PM Modi

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  (PM Modi) తన 75వ జన్మదినాన్ని (సెప్టెంబర్ 17) ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంగా దేశం నలుమూలల నుంచి శుభాకాంక్షల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా సినీ, రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ శుభాకాంక్షలను అందజేస్తున్నారు. మోదీతో ఉన్న వ్యక్తిగత అనుబంధాన్ని, ఆయన చేసిన కృషిని, సాధనలను గుర్తుచేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు. మోదీ నాయకత్వాన్ని, క్రమశిక్షణను ప్రశంసిస్తూ ప్రముఖులు తమ అభిమానాన్ని వ్యక్తపరుస్తున్నారు.

టాలీవుడ్ (Tollywood) నుంచి కూడా పలువురు స్టార్ హీరోలు ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అక్కినేని నాగార్జున, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి వంటి ప్రముఖులు తమ ట్వీట్లు, వీడియోల ద్వారా మోదీకి బర్త్‌డే విషెస్ అందజేశారు. ఎవరు ట్వీట్లు పెట్టగా, మరికొందరు ప్రత్యేక వీడియోలను పోస్ట్ చేసి ఆయన గొప్పతనాన్ని వివరించారు.

అక్కినేని నాగార్జున

అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) మాత్రం మోదీ పుట్టినరోజుకు ముందుగానే ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ‘‘దేశం కోసం మోదీ తన వ్యక్తిగత జీవితాన్నీ పక్కన పెట్టి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాంటి మహానేత గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను’’ అని నాగ్‌ ఒక వీడియోలో పేర్కొన్నారు. ఆయనతో తాను కలిసిన తొలి అనుభవాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. 2014లో గాంధీనగర్‌లో మోదీని మొదటిసారి కలిశానని, ఆ సమయం లో ఆయన చెప్పిన మాటలు నన్నెంతో ప్రభావితం చేశాయని నాగార్జున తెలిపారు.

”ఒకసారి మైసూర్ లో తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ నన్ను మీట్‌ అయ్యారని, సౌత్ స్టార్ నాగార్జునతో ఫోటో దిగామని, నా గురించి వాళ్లు ఎన్నో మంచి విషయాలు చెప్పారని’ మోదీ నాతో చెప్పారు. నేను షాక్ అయ్యాను. ఆయన గుర్తుచేసుకుని మరీ నాతో చెప్పడం నన్నెంతో ఆశ్చర్యపరిచింది. ఎల్లప్పుడూ అలాగే వినయంగా ఉండాలని, మనిషికి అవే ముఖ్యమని ఆయన చెప్పారు. ‘మన్‌ కీ బాత్‌’లో మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) గురించి మాట్లాడుతూ లెజెండ్ అని ప్రస్తావించారు. ఇండియాకి ఆయన మళ్లీ కావాలి. దేశం కోసం ఆయన ఎన్నో త్యాగం చేశారు” అని నాగార్జున తెలిపారు.

మహేష్ బాబు ఎక్స్ లో పేర్కొన్నారు

మన గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్రమోదీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని మరియు మీ నాయకత్వంతో మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను” అని మహేష్ బాబు (Mahesh Babu) ఎక్స్ లో పేర్కొన్నారు. మోదీ మరెన్నో విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తూ ఓ వీడియోని షేర్ చేశారు.

జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ట్వీట్ చేస్తూ ”అత్యంత శ్రద్ధాసక్తుడు, ఎంతో అంకితభావం కలిగిన నరేంద్రమోదీ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మన గర్వించదగ్గ దేశాన్ని మెరుగుపరచడానికి మీ అవిశ్రాంత ప్రయత్నాలు ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ప్రకాశింపజేయాలి” అని పేర్కొన్నారు.

రజనీకాంత్‌ ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు

ప్రధాని మోదీ మీరు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. దేశాన్ని ముందుకు నడిపే శక్తిని ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ రజనీకాంత్‌ (Rajinikanth) ఎక్స్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని

”నరేంద్ర మోదీ ఎంతో మందికి స్ఫూర్తినిస్తున్నారు. 75 ఏళ్ల వయసులోనూ మీరు 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తున్నారు. ప్రపంచం ముందు మన దేశాన్ని తలెత్తుకునేలా చేశారు. మీరు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని ఆశిస్తున్నాను. రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నా” అంటూ రాజమౌళి (Rajamouli) వీడియో పోస్ట్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/pm-modi-mukesh-ambani-wishes-pm-narendra-modi-on-his-birthday/national/549007/

75th birthday celebrations Akkineni Nagarjuna Breaking News celebrity wishes Jr NTR latest news Mahesh Babu Narendra Modi birthday SS Rajamouli Telugu News Tollywood stars

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.