మన్కీ బాత్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
నరసాపురం : మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Narendra Modi) పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం లేస్ పరిశ్రమ, లేస్ పని చేసే మహిళల గురించి గర్వంగా ప్రస్తావించడం మన జిల్లాకు ఎంతో గర్వకారణమని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో నరసాపురం మహిళలు తమ చేతివృత్తి ద్వారా తయారు చేసే లేస్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. (Mann Ki Baat)ఇది లోకల్ ఫర్ వోకల్ అనే నినాదానికి ఒక చక్కని ఉదాహరణ అని కొనియాడారు. 250 గ్రామాలలో లక్షలాది మంది గ్రామీణ మహిళలు ఈ కళ ద్వారా స్వయం ఉపాధి పొందుతూ, ఆర్థికంగా ఎదగడం పట్ల ప్రధాని ప్రశంసలు కురిపించారు.
Read also: TTD: టోకెన్ కలిగిన భక్తులకు అసౌకర్యం లేకుండా వైకుంఠ దర్శనాలు
మహిళా కళాకారులకు ప్రధాని ప్రశంసలు
మహిళలు ఇలాంటి పురాతన కళలను కాపాడుకుంటూ వృత్తిలో రాణించడం దేశానికి గర్వకారణమని చెప్పారు. (Mann Ki Baat) ఇక్కడ తయారైన 500 రకాల క్రోచెట్ లేస్ ఉత్పత్తులు విదేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయని, ఇది భారతీయ సంస్కృతి, నైపుణ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తాందని ప్రధాని పేర్కొన్నారు. నరసాపురం లేస్ పరిశ్రమకు ఇటీవల జిఐ ట్యాగ్ కూడా లభించిన నేపథ్యంలో, ప్రధాని ప్రసంగంలో నరసాపురం లేస్ మహిళల కోసం ప్రస్తావించడం స్థానికలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నరసాపురం లెస్ అభివృద్ధికి గత సంవత్సర కాలంగా పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎంతో కృషి చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పెద్దమైన వానిలంక గ్రామంలో పలు కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ మనకి బాత్ కార్యక్రమాన్ని స్వయంగా వీక్షి ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమ శాఖ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, పశ్చిమగోదావరి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: