టాలీవుడ్ మాస్ హీరో రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ (Peddi) అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, విడుదలకు ముందే ఒక్కో అప్‌డేట్‌తో సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా టీమ్, ఫస్ట్ సింగిల్ ‘చికిరి చికిరి’ సాంగ్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది.
Read Also: Salman Khan: సల్మాన్ ఖాన్ కు షాక్.. కోర్టు నోటీసులు
ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపింది. ఏఆర్ రెహమాన్ (AR Rahman) తో కలిసి ఈ ‘చికిరి’ పదానికి అసలు అర్థం ఎంటో చెప్పాడు బుచ్చిబాబు. ఈ సందర్భంగా ప్రోమోను పంచుకున్నారు. ఈ పాట ఫుల్ లిరికల్ నవంబర్ 07న విడుదల కాబోతుంది.
తన చిన్ననాటి జ్ఞాపకాలను రెహమాన్‌తో పంచుకున్నారు
ఈ సందర్భంగా బుచ్చిబాబు తన చిన్ననాటి జ్ఞాపకాలను రెహమాన్‌తో పంచుకున్నారు. తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన కజిన్ బాబీ ఇచ్చిన ‘బొంబాయి’ సినిమా (‘Bombay’ movie) పాటల క్యాసెట్ విన్నప్పటి నుంచి ఆయనకు పెద్ద అభిమానిని అయ్యానని తెలిపారు. ‘పెద్ది’ కథ ఫైనల్ అయ్యాక సంగీత దర్శకుడిగా మరో ఆలోచన లేకుండా రెహమాన్‌నే ఎంచుకున్నట్లు బుచ్చిబాబు తన మనసులోని మాటను బయటపెట్టారు.
ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ ఆలపించిన ‘చికిరి చికిరి’ పూర్తి పాటను నవంబర్ 7న విడుదల చేయనున్నారు. ఇక ‘పెద్ది’ (Peddi) సినిమాను 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: