📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Komatireddy: ‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి కోమటిరెడ్డి

Author Icon By Saritha
Updated: December 27, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Minister Komatireddy watched the movie ‘Dandora’

‘కోర్టు’ సినిమాలో మంగపతిగా అలరించిన శివాజీ మరోసారి ఓ విభిన్నమైన పాత్రలో ‘దండోరా’ సినిమా లో కనిపించారు.. నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవి ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ నిర్మాత. ఈనెల 25న చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం, సహజమైన పాత్రలు, భావోద్వేగాలను తాకే కథనం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

Read Also: Prakash Raj: అనసూయకు ప్రకాష్ రాజ్ మద్దతు

‘దండోరా’ సినిమాను వీక్షించిన మంత్రి

థియేటర్లలో స్పందన పెరుగుతున్న కొద్దీ, రోజురోజుకూ ఈ సినిమా ప్రదర్శితమవుతున్న స్క్రీన్ల సంఖ్య కూడా పెరుగుతోంది. మొదటి షో నుంచే మంచి వసూళ్లు రాబడుతూ దూసుకెళుతోంది. తాజాగా తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy) ఈ చిత్రాన్ని వీక్షించారు.

సినిమా చూసిన అనంతరం ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణ మట్టిలో పుట్టిన కథగా ‘దండోరా’ తనను ఎంతో ఆకట్టుకుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ జీవనశైలిని, ఇక్కడి మనుషుల మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను చాలా సహజంగా చూపించారని (Komatireddy) ప్రశంసించారు.

‘దండోరా’ టీమ్‌కు హృదయపూర్వక అభినందనలు

మన చుట్టూ జరుగుతున్నా, చాలాసార్లు పట్టించుకోని ఒక సామాజిక సమస్యను ఈ సినిమా సున్నితంగా ప్రశ్నిస్తుందని, ప్రేక్షకులను ఆలోచించేలా చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందించడంలో ‘దండోరా’ పూర్తిగా విజయవంతమైందని అన్నారు.

‘బలగం’ సినిమా తర్వాత అదే స్థాయిలో హృదయాన్ని తాకిన చిత్రంగా ‘దండోరా’ను కోమటిరెడ్డి అభివర్ణించారు. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, భావోద్వేగాలు మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాయని పేర్కొన్నారు. మంచి సందేశంతో కూడిన సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ‘దండోరా’ టీమ్‌కు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Dandora Movie komatireddy venkat reddy latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.