Meenakshi Chaudhary: ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!

Read Time:  1 min
Meenakshi Chaudhary: ప్రతిసారీ అదో కొత్త అనుభూతి అంటూ మీనాక్షి భావోద్వేగం!
FONT SIZE
GET APP
Meenakshi is emotional, saying that it is a new experience every time!
Meenakshi is emotional, saying that it is a new experience every time!

Meenakshi Chaudhary: టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ మీనాక్షి చౌదరి ఇటీవల కలియుగ వైకుంఠం తిరుమలను సందర్శించారు. షూటింగ్ బిజీ నుంచి చిన్న విరామం తీసుకున్న ఆమె, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పర్యటన అనంతరం ఆమె తన సోషల్ మీడియా వేదికగా తిరుమలలో గడిపిన క్షణాలను, అక్కడ కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని అభిమానులతో పంచుకున్నారు.

Read also: Social media law : విద్యార్థులకు సోషల్ మీడియా నిషేధమా? ఏపీ కీలక నిర్ణయం

ప్రతిసారీ తొలి అనుభూతే!

“తిరుమల శ్రీవారిని నేను ఈ మధ్యనే దర్శించుకున్నా. నేను పొందిన అనుభూతి, ఆనందాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నా. నేను తిరుమలకు తరుచుగా వెళ్తుంటా. అయితే తిరుమలకు వచ్చిన ప్రతిసారీ తొలిసారిగా శ్రీవారిని దర్శించుకున్న అనుభూతి కలుగుతుంది. తిరుమలలో గాలి కూడా గోవింద నామస్మరణ చేస్తుంది. మనకు ఎన్ని టెన్షన్లు ఉన్నా, ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా తిరుమలలో అడుగుపెట్టగానే మన మనసు ఓ ట్రాన్స్‌లోకి వెళ్లిపోతుంది. నన్ను నేను మర్చిపోయి గోవిందుడి దర్శనం చేసుకుంటా. దర్శనం తర్వాత ఓ చిన్న విషయం గమనించా. మన దర్శనం కోసం ఎంతోమంది మనకు తెలియకుండా కష్టపడుతుంటారు. వాళ్లే టీటీడీ సిబ్బంది. “

” టీటీడీ సిబ్బంది చేసేది సేవా కార్యక్రమమే కాదు, మహా యజ్ఞం. అన్నదానం నుంచి ప్రసాదం వరకూ టీటీడీ సిబ్బంది అందించే సహకారం మాటల్లో చెప్పలేం. నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే.. జపాన్‌లో ప్రజారవాణా వ్యవస్థ ఎంత కచ్చితంగా టైమ్‌కు వస్తుందో.. అలాగే తిరుమలలోనూ ప్రజా రవాణా సేవలు అందిస్తున్నారు. ప్రతి ఐదు నిమిషాలకు ఒక ఉచిత బస్సు వస్తోంది. బస్టాండ్ వద్ద బస్సుల టైమింగ్ ప్రదర్శిస్తున్నారు. వృద్ధులకు చాలా ఉపయోగకరంగా ఉంది.

“టీటీడీ మన తిరుమల పర్యటనను చాలా ఆనందంగా మారుస్తోంది. అందుకే తిరుమలకు వెళ్తుంటే ఎంతో పీస్ ఫుల్‌గా ఉంటోంది. టీటీడీకి థ్యా్ంక్స్ చెప్పాలనిపిస్తోంది. తిరుమల కేవలం ఆలయం మాత్రమే కాదు మన హృదయాన్ని శుభ్రపరిచి. మన మనసును ప్రశాంతపరిచి, మనల్ని మనకు మళ్లీ కనెక్ట్ చేసే ఓ డివైన్ ఎక్స్‌పీరియన్స్. ఓం నమో వేంకటేశాయా” అని చెప్పుకొచ్చారు మీనాక్షి చౌదరి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.