📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Kiran Abbavaram: సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Author Icon By Anusha
Updated: October 12, 2025 • 11:57 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Kiran Abbavaram

ఇటీవల తెలుగు సినీ పరిశ్రమ (Telugu film industry) లో జర్నలిస్టుల అడుగుతున్న కొన్ని ప్రశ్నలు వివాదాస్పదంగా మారుతున్నాయి. కొందరు సెలబ్రెటీలు ఆ ప్రశ్నలను సైలెంట్‌గా తీసుకుంటుంటే, మరికొందరు ధైర్యంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ, తప్పును తప్పుగా అని చెప్పడం జరుగుతోంది. ఈ పరిణామాలు సోషల్ మీడియాలో, ఫ్యాన్స్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.

Andhra King Taluka Movie: ఆంధ్రా కింగ్ తాలూక టీజర్ వచ్చేసింది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో, మంచు లక్ష్మికి డ్రెస్సింగ్ గురించి ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించినప్పుడు, ఆమె తీవ్రంగా స్పందించింది. “నీకెంత ధైర్యం” అని కడిగి పారేసింది. ఈ సంఘటనతో, మంచు లక్ష్మి (Manchu Lakshmi) తనను అవమానించేలా ప్రశ్నించారని ఫిల్మ్ అసోసియేషన్ ,ఫిల్మ్ ఛాంబర్‌కి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై ఆ సీనియర్ జర్నలిస్టు క్షమాపణ చెప్పుతూ వీడియో విడుదల చేశారు.

కానీ ఆ వివాదం సద్దుమణిగక ముందే, మరోసారి లేడీ జర్నలిస్టు తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ని అడగకూడని ప్రశ్న అడిగి సమస్యలో చిక్కుకుంది. ‘డ్యూడ్’ సినిమా ప్రమోషన్లలో హైదరాబాద్‌లోని ప్రెస్ మీట్ సమయంలో, ఆ లేడీ జర్నలిస్టు ప్రదీప్‌ను ఈ విధంగా అడిగారు: ‘మీరు లుక్ పరంగా హీరో మెటీరియల్ కాదు.

అడగకూడని ప్రశ్న అడిగి సమస్యలో చిక్కుకుంది

కానీ రెండు సినిమాలకే ఇంత సక్సెస్ వచ్చిదంటే అది మీ హార్డ్ వర్కా.. లేక అదృష్టమా? అని ఆమె ప్రశ్నించారు. దానికి ఏం సమాధానం చెప్పాలా ప్రదీప్ రంగనాథన్ ఆలోచిస్తుండగా పక్కనే ఉన్న శరత్‌కుమార్ (Sarath kumar) మైక్ అందుకున్నారు. నేను 170 సినిమాల్లో నటించాను.

ప్రదీప్ హీరో మెటీరియల్ కాదని మీరెలా చెప్పగలరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే. హీరో అంటే ఫలానా లక్షణాలు ఉండాలని ఏమీ లేదు. ఈ సమాజానికి మేలు చేసే ప్రతి వ్యక్తి హీరోనే’ అని సమాధానం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆ మహిళా జర్నలిస్టుపై పెద్దయెత్తున ట్రోల్స్ మొదలయ్యాయి. 

ఆమె ఫోటోల్ని తెగ వైరల్ చేస్తూ

అలాంటి ప్రశ్న అడగడానికి నీకసలు సిగ్గుందా.. ముందు నీ మొహం ఎలా ఉందో చూసుకో అంటూ ఆమె ఫోటోల్ని తెగ వైరల్ చేస్తూ నెగిటివ్‌గా కామెంట్ల వర్షం కురిపించారు.తాజాగా కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) హీరోగా నటించిన ‘ కె ర్యాంప్ ’ చిత్ర (‘K Ramp’ movie) ట్రైలర్‌ని శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అదే జర్నలిస్టు ప్రదీప్‌ ఇష్యూ గురించి స్పందించాలని కిరణ్‌‌ని అడిగారు. 

దీంతో ఆయన మాట్లాడుతూ.. . ‘మీరు పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోని కించపరుస్తూ అలాంటి ప్రశ్న వేయడం కరెక్ట్ కాదు. మనమంతా ఒక్కటే. ఏదున్నా మనం మనం చూసుకుంటాం. అంతేకానీ పక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్లని కించపరిచేలా అలాంటి ప్రశ్నలు దయచేసి అడగొద్దు.

ప్రదీప్‌ని హీరో మెటీరియల్ కాదు

ప్రదీప్‌ని (Pradeep Ranganathan) హీరో మెటీరియల్ కాదు అని మీరు అనడం చూస్తున్న నాకే బాధగా అనిపించింది. ఆయన ఇంకెంత బాధపడి ఉంటారు. ఇకపై అలాంటి ప్రశ్నలు అడగకండి’ అని చెప్పారు.ఈ ఇష్యూపై సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ (Radhika Sarath kumar) కూడా ఘాటుగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

రిపోర్టర్ ప్రశ్న అడగడం, దానికి శరత్‌కుమార్ సమాధానం ఇస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ఇదొక ప్రశ్నా.. శరత్‌కుమార్, ప్రదీప్ బాగా చెప్పారు’ అంటూ ట్వీట్ చేశారు.ఆమె ట్వీట్ కింద శరత్‌కుమార్‌ని పొగుడుతూనే ఆ లేడీ జర్నలిస్ట్‌ (Lady journalist) పై నెటిజన్లు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. అలాగే మీరు తప్పు చేశారంటూ రిపోర్టర్‌ని ధైర్యంగా నిలదీసిన కిరణ్ అబ్బవరంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

‘K Ramp’ movie Breaking News Kiran Abbavaram latest news Pradeep Ranganathan Telugu cinema controversy Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.