
మలయాళ సినీ అభిమానులకు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) పుట్టినరోజు సందర్భంగా నిజంగా ఒక గొప్ప సర్‌ప్రైజ్ లభించింది. మలయాళ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎదురు చూస్తున్న ‘ఖలీఫా’ (Khalifa) సినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
“ది బ్లడ్‌లైన్” అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ గ్లింప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పృథ్వీరాజ్ (Prithviraj Sukumaran) ఇందులో ఒక క్రూరమైన గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ వీడియోలో ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, ఇంటెన్సిటీ అన్నీ కలిసి ఫ్యాన్స్‌కి హై వోల్టేజ్ ఫీలింగ్ ఇచ్చాయి.
Read Also: Mithra Mandali Movie: మిత్ర మండలి మూవీ రివ్యూ
గ్లింప్స్ (Glimpse) మొదటి సెకండ్ నుంచే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గోల్డ్ మాఫియా ప్రపంచం చూపిస్తూ ప్రారంభమవుతుంది. ఇందులో పృథ్వీరాజ్ నటించిన ఆమిర్ అలీ అనే పాత్ర గోల్డ్ స్మగ్లింగ్, క్రైమ్, రివెంజ్ నేపథ్యాల్లో నడిచే కథకు ప్రాణం పోస్తుంది.
కేవలం 50 సెకండ్ల గ్లింప్స్‌లోనే సినిమాకు ఉన్న గ్రాండియస్ విజన్ స్పష్టంగా కనిపిస్తోంది. పృథ్వీరాజ్ లుక్‌లోని రఫ్‌నెస్, అతడి కళ్ళలో కనిపించే హీటు ఈ సినిమాలోని పాత్ర తీవ్రతను తెలియజేస్తున్నాయి.
పృథ్వీరాజ్ నటించిన సినిమాలలో మీకు ఇష్టమైన మూవీ ఏది?
ఈ సినిమా గోల్డ్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో రాబోతుంది. వైశాఖ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. జిను వి. అబ్రహం, సూరజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్ బెజాయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం ఓనం సందర్భంగా 2026లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: