📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు గంభీర్‌పై స్టేడియంలో డౌన్ డౌన్ నినాదాలు.. కోహ్లీ షాక్ త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

Kerala: షింజిత ముస్తాఫా పై కేసు నమోదు

Author Icon By Anusha
Updated: January 21, 2026 • 4:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Kerala: Case registered against Shinjitha Mustafa?

సోషల్ మీడియా వేదికలు ఈ రోజుల్లో వ్యక్తిగత అభిప్రాయాలు, అనుభవాలను పంచుకునే ప్రధాన వేదికలుగా మారాయి. అయితే అదే సమయంలో ఫేమ్ కోసం, ఫాలోవర్ల సంఖ్య పెంచుకోవడం కోసం కొందరు హద్దులు దాటి ప్రవర్తించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. తాజాగా, బస్సులో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఇన్‌ఫ్లూయెన్సర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వైరల్ కాగా.. ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేరళ (Kerala) లో చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. 

Read Also: Spain: ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదంపై విజయం: జైశంకర్

కోజికోడ్‌కు చెందిన 42 ఏళ్ల దీపక్ అనే వ్యక్తిపై వడకరకు చెందిన 35 ఏళ్ల షింజిత ముస్తాఫా అనే యువతి జనవరి 16న సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. రద్దీగా ఉన్న బస్సులో ప్రయాణిస్తుండగా దీపక్ తనను అసభ్యంగా తాకాడని ఆమె ఆరోపించింది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయి, లక్షల మందికి చేరింది.ఈ పరిణామంతో దీపక్ తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.

పరారీలో షింజిత

వీడియో వైరల్ అయిన రెండు రోజుల తర్వాత, జనవరి 18న గోవిందపురంలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.తన కుమారుడి మృతికి షింజిత ముస్తాఫా పెట్టిన వీడియో, దానివల్ల కలిగిన అవమానమే కారణమని దీపక్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీపక్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోజికోడ్ మెడికల్ కాలేజీ పోలీసులు సోమవారం షింజిత ముస్తాఫా పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 108 కింద ఆత్మహత్యకు ప్రేరేపణ కేసు నమోదు చేశారు.

ప్రస్తుతం షింజిత ముస్తాఫా, పరారీలో ఉందని, ఆమె కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్ కూడా స్పందించి, వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని నార్త్ జోన్ డీఐజీని ఆదేశించింది. బస్సులోని ఇతర ప్రయాణికులను విచారించి, వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Influencer Kerala News latest news Shinjita Mustafa Social Media Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.