Latest News: K-Ramp Movie: కె- ర్యాంప్‌ ట్రైలర్ విడుదల

Read Time:  1 min
K-Ramp Movie
K-Ramp Movie
FONT SIZE
GET APP
K-Ramp Movie

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మళ్లీ తన ప్రత్యేకమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకుల మనసులను గెలుచుకునేందుకు సిద్ధమయ్యాడు. ఆయన నటించిన తాజా సినిమా “కె ర్యాంప్” (K-Ramp Movie) ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది. ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌లో లక్షల వ్యూస్ సాధించి టాప్ ట్రెండ్స్‌లో స్థానం సంపాదించింది.

Kurukshetra Series: కురుక్షేత్ర (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ

కిరణ్ అబ్బవరం నటన, హాస్య పంచులు, రొమాంటిక్ ట్రాక్ అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. “అలా కాళ్లూపకూడదేమో బాబూ” అని బామ్మ చెప్పగా, “నేను ఊపడం లేదు బామ్మా.. నా గర్ల్‌ఫ్రెండ్‌ ని తలుచుకుంటే వాటంతట అవే ఊగుతున్నాయి” అనే రిప్లయ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజ హీరోయిన్‌గా నటిస్తోంది.వీకే నరేష్‌, వెన్నెల కిషోర్‌, సాయి కుమార్‌, మురళీధర్ గౌడ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహించగా, హాస్య మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు.

ట్రైలర్ విడుదల

మొదట టీజర్ విడుదలైనప్పుడు కొంతమంది ఈ సినిమాను అడల్ట్ ఎంటర్‌టైనర్‌గా భావించినప్పటికీ, (K-Ramp Movie) ట్రైలర్‌తో ఆ అనుమానాలకు ముగింపు పలికారు.పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం, కిరణ్ (Kiran) కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. దీపావళి కానుకగా ఈ నెల 18న గ్రాండ్‌గా విడుదల కానుంది.

సినీ సర్కిల్స్ టాక్ ప్రకారం ఈ చిత్రం ఇండియా వైడ్‌గా దాదాపు రూ.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగుతుందట. అంటే ఈ చిత్రం వసూలు చేయాల్సిన గ్రాస్ రూ.16 కోట్లు. దీపావళి బరిలో మొత్తం ఆరు సినిమాలు(మూడు తెలుగు, మూడు డబ్బింగ్) రిలీజ్ అవుతుండటంతో పోటీ తీవ్రంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.