ఢిల్లీలోని ప్రసిద్ధ అరుణ్ జైట్లీ స్టేడియం (Arun Jaitley Stadium) లో శుక్రవారం ప్రారంభమైన భారత్ – వెస్టిండీస్ (India vs West Indies) రెండో టెస్టు మ్యాచ్‌తో సిరీస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకోవడంతో అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Kohli-Rohith: విజయ్ హజారే ట్రోఫీలో బరిలోకి దిగనున్న రోహిత్, కోహ్లీ
గిల్‌కు ఇది ప్రత్యేక క్షణం, ఎందుకంటే గత ఆరు మ్యాచ్‌ల్లో వరుసగా టాస్ ఓడిపోవడం అతనిని కొంత నిరుత్సాహానికి గురి చేసింది. చివరికి ఆ దురదృష్టానికి తెరదించి, కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి సరైన నిర్ణయం తీసుకున్నాడు.
సిరీస్‌ను 2-0 తేడాతో క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది.ఇప్పటికే తొలి టెస్టులో ఇన్నింగ్స్, 140 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌ను చిత్తుచేసిన భారత్, ఈ మ్యాచ్‌లోనూ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది
మరోవైపు రోస్టన్ చేజ్ నేతృత్వంలోని వెస్టిండీస్ జట్టు (West Indies) సిరీస్‌ను సమం చేయాలంటే ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.అయితే, ఢిల్లీ పిచ్ వారికి పెను సవాలుగా మారే అవకాశం ఉంది. ఇక్కడి నల్లమట్టి పిచ్ స్పిన్నర్ల (Pitch spinners) కు ఎక్కువగా సహకరిస్తుందని అంచనా. దీంతో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన భారత నాణ్యమైన స్పిన్ దళాన్ని ఎదుర్కోవడం విండీస్ బ్యాట్స్‌మెన్‌కు కత్తిమీద సాములాంటిదే.
టాస్ గెలవడంతో భారత్ భారీ స్కోరు చేసి, ఆ తర్వాత ప్రత్యర్థిని స్పిన్ ఉచ్చులో బిగించాలని భావిస్తోంది.వెస్టిండీస్ XI: జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్. ఇండియా XI: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: