Hyderabad: పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్

Read Time:  1 min
Hyderabad: పోలీసులను పాముతో బెదిరించిన ఆటో డ్రైవర్
FONT SIZE
GET APP
Hyderabad: Auto driver threatens police with snake
Hyderabad: Auto driver threatens police with snake

హైదరాబాద్‌ (Hyderabad) లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులకు రోజుకో కొత్త అనుభవం ఎదురవుతోంది. మద్యం మత్తులో వాహనాలు నడిపేవాళ్ల ప్రవర్తన చూస్తే పోలీసులు కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. కొందరు “నా బ్యాగ్రౌండ్ తెలుసా?” అంటూ బెదిరింపులకు దిగుతుంటే, మరికొందరు రోడ్డుపై పడుకుని చనిపోతామంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇంకొందరు ఇంట్లో విషయం తెలిసిపోతే సమస్యలు వస్తాయని పోలీసుల ముందే బోరున ఏడుస్తున్నారు.

Read also: Telangana: కొత్త వాహనాలు కొనుగోలుపై అదనపు ట్యాక్స్ 

పోలీసులపై పాముతో బెదిరింపులకు పాల్పడ్డాడు

ఈ తనిఖీల్లో ఇప్పటివరకు ఎన్నో వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఏకంగా బ్రీత్ అనలైజర్ మెషీన్లను ఎత్తుకుపోయిన ఘటనలు కూడా పోలీసు రికార్డుల్లో ఉన్నాయి. చాంద్రాయణగుట్టలో మద్యం మత్తులో ఉన్న ఆటోడ్రైవర్ పోలీసులపై పాముతో బెదిరింపులకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహిస్తున్నప్పుడు,

ఒక ఆటోడ్రైవర్‌ను ఆపి పరీక్షించగా రీడింగ్‌ 150 వచ్చింది. దీంతో పోలీసులు ఆటోను సీజ్‌ చేయడంతో, ఆటోడ్రైవర్ అందులోంచి పామును తీసి పోలీసులను బెదిరించాడు. దీంతో పోలీసులు కొద్దిసేపటి తర్వాత ధైర్యం తెచ్చుకుని.. జాగ్రత్తగా డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాముతో పోలీసులను బెదిరించిన కేసులో అతడిని అరెస్ట్ చేశారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.