టాలీవుడ్‌లో కామెడీ పండించే హీరోల్లో రవితేజ ఎప్పుడూ ముందుంటారు. వెంకీ, దుబాయ్ శీను, కిక్.. ఇలా ఒకప్పటి మాట పక్కనపెడితే ఈ మధ్య కాలంలో రవితేజ నుంచి సరైన కామెడీ ఎంటర్‌టైనర్ అయితే పడలేదు. వరుసగా యాక్షన్ సినిమాలతో సీరియస్ సబ్జెక్టులతోనే ఆడియన్స్‌ని పలకరించారు. ఇప్పుడు, ఆయన హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’. ఇందులో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతీ హీరోయిన్లుగా నటించారు.
Read Also: Bank Of Bhagyalakshmi: ‘బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి’ మూవీ రివ్యూ!
సక్సెస్ మీట్ హైలైట్
ఈ సినిమా, సక్సెస్ మీట్ హైదరాబాద్ (HYD) లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ‘వామ్మో వాయ్యో’ పాటకు మాస్ మహారాజా రవితేజ, సునీల్, హీరోయిన్ డింపుల్ హయాతితో కలిసి దర్శకుడు కిషోర్ తిరుమల స్టేజీపై ఉత్సాహంగా డ్యాన్స్ చేసి ప్రేక్షకులను అలరించారు. సినిమా విజయం సందర్భంగా జరిగిన ఈ సందడి సక్సెస్ మీట్‌కి హైలైట్‌గా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: