నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయిక అంటే మాస్ ప్రేక్షకులకి ఎప్పుడూ పండగే. ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ లాంటి సంచలన బ్లాక్‌బస్టర్ల తర్వాత ఈ జోడీ మళ్లీ సిద్ధం చేసిన ‘ అఖండ 2 : తాండవం’ (Akhanda-2) పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శివతాండవం, అఘోరా శక్తి, అద్భుతమైన విజువల్స్ వంటి ప్రత్యేకతలతో తెరకెక్కిన ఈ చిత్రం కోసం ఎంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Avatar 3: ఈ నెల 5 నుంచి ‘అవతార్ 3’ ఐమ్యాక్స్ బుకింగ్స్ ప్రారంభం
అతిపెద్ద నగరంగా GHMC
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘హైందవం’ అనే మొదటి లిరికల్ పాటను విడుదల చేసింది.ఈ పాటకు నాగ గురునాథ శర్మ సాహిత్యం అందించగా, ప్రఖ్యాత ‘సర్వేపల్లి సిస్టర్స్’ గాయనీమణులు శ్రేయ, రాజ్యలక్ష్మి తమ గాత్రంతో ఆలపించారు. ఎస్. థమన్ సంగీతం ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక భావనతో సాగే ఈ పాట శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.
‘అఖండ 2: తాండవం’ (Akhanda-2) చిత్రంలో నేపథ్య సంగీతం కూడా ప్రత్యేకంగా ఉండనుంది. సంస్కృత శ్లోకాలు, వేదమంత్ర పఠనంలో నిష్ణాతులైన పండిట్ శ్రవణ్ మిశ్రా, పండిట్ అతుల్ మిశ్రా సోదరులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు. వారి శ్లోకాలు సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: