ప్రస్తుతం విభిన్న కాన్సెప్ట్‌లు, వైవిధ్యమైన పాత్రలతో తనదైన శైలి తో, దూసుకుపోతున్న అగ్ర కథానాయిక కీర్తి సురేశ్ (Keerthy Suresh) మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆమె నటించిన తాజా చిత్రం ‘రివాల్వర్ రీటా’ (Revolver Rita Movie) ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
ఈ సినిమాకు కె. చంద్రు దర్శకత్వం వహించగా, ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్ ఒక కీలక పాత్రలో నటించడం చిత్రానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయిన ఈ చిత్రం నవంబర్ 28న విడుదల కానుంది.
Read Also: Bigg Boss 9 Tamil: పొట్టు పొట్టు కొట్టుకున్న కంటెస్టెంట్స్
ట్రైలర్ విడుదల
ఈ సందర్భంగా మూవీ (Revolver Rita Movie) నుంచి ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. కీర్తి సురేశ్ ఈ సినిమాలో ‘రీటా’ అనే సామాన్య మధ్యతరగతి యువతి పాత్రలో కనిపించనుంది. అనూహ్య పరిస్థితుల కారణంగా ఆమె తుపాకీ (రివాల్వర్) పట్టుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత ఆమె ఎలాంటి సాహసాలు, సవాళ్లు ఎదుర్కొంది అనేది ప్రధాన కథాంశం. ఇది కామెడీ అంశాలతో కూడిన పక్కా యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రాబోతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: