హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సమంత (Samantha) హాజరయ్యారు. సమంతను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. సమంత బయటకు రాగానే అభిమానులు చుట్టుముట్టారు. ఆమెను తాకేందుకు కొందరు ప్రయత్నించడంతో అతి కష్టం మీద సమంత (Samantha) బౌన్సర్ల సాయంతో కారులో ఎక్కారు. ఇటీవల హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైతం ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది.
Read Also: Bigg Boss 9 : బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల
అసలేం జరిగిందంటే..!
నిన్న సాయంత్రం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని చెక్‌పోస్ట్ ప్రాంతంలో సిరిమల్లె శారీస్ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవానికి సామ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. అయితే, షోరూమ్ ఓపెనింగ్ కార్యక్రమం ముగిసిన అనంతరం సమంత బయటకు వచ్చి తన కారు వద్దకు వెళుతుండగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. సమంతను చుట్టుముట్టి సెల్ఫీల కోసం ప్రయత్నించారు.
దాంతో ఒక్కసారిగా రద్దీ అదుపు తప్పి, ఆమె కారు వరకు వెళ్లడం కూడా కష్టంగా మారింది. దీంతో చేసేదేమిలేక వ్యక్తిగత సెక్యూరిటీ సిబ్బంది అతికష్టం మీద సమంతను అభిమానుల మధ్య నుంచి తప్పించి కారు ఎక్కించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: