📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Stoppage of Indus Waters : పాక్‌కు సంక్షోభం, భారత్ దృఢ వైఖరి

Author Icon By Uday Kumar
Updated: May 16, 2025 • 1:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి


పాకిస్తాన్ దయనీయ విజ్ఞప్తి

పాకిస్తాన్ మరోసారి భారత్ సంక్షోభం దయాదాక్షిణ్యాల కోసం విశ్వ ప్రయత్నాలు ప్రారంభించింది. ఉగ్రవాద మూకలను రెచ్చగొట్టడమే కాకుండా యుద్ధానికి సిద్ధమన్న

సంకేతాలు ఇచ్చి బీరాలు పలికిన పాకిస్తాన్ సంక్షోభం ఇప్పుడు మా ప్రాణాలు కాపాడండి అంటూ ఇండియా కాలావేల పడుతుంది.

సింధు నది జలాలను నిలిపివేయడంతో తమ దేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని భారతదేశానికి ఓ లేఖ రాసింది పాకిస్తాన్. ఈ నిర్ణయంతో పాకిస్తాన్‌కు భారీ సంక్షోభం ఎదురవుతుందని భారతదేశం గ్రహించింది.

ఉగ్రదాడి నేపథ్యం: భారత్ కఠిన నిర్ణయం

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో, భారతదేశంలో 1960 నాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత ఈ విజ్ఞప్తి వచ్చింది.

ఈ దాడిలో 26 మంది పౌరులు, ముఖ్యంగా పర్యాటకులు మరణించారు. వ్యూహాత్మక వ్యవహారాలపై అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఈ చర్యను ఆమోదించింది.

ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించిన ఒప్పందం నుండి న్యూ ఢిల్లీ మొదటిసారి తప్పుకుంది.

పాకిస్తాన్ ఆందోళన, భారత్ వ్యూహం

దీంతో దిక్కు తోచిన స్థితిలో ఉన్న పాకిస్తాన్, భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు పంపిన లేఖలో ఒప్పందాన్ని నిలిపివేయడం దేశంలో సంక్షోభానికి దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

సింధూ జలాలు పాకిస్తాన్‌లోకి ప్రవహించకుండా నిరోధించడానికి భారతదేశం ఇప్పుడు స్వల్పకాలిక, మధ్యకాలిక మరియు దీర్ఘకాలిక అనే మూడు అంచెల వ్యూహాన్ని ప్రకటించింది.

భారత భూభాగాన్ని నిరుపయోగంగా వదిలేయకుండా చూసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటీల్ అన్నారు.

సింధు జలాల ఒప్పందం: కీలక నిబంధనలు

1960 ఒప్పందం ప్రకారం భారతదేశంలో ఉన్న సింధూ నది వ్యవస్థ ద్వారా తీసుకెళ్లే మొత్తం నీటిలో 30% భారతదేశానికి దక్కగా, మిగిలిన 70% పాకిస్తాన్‌కు దక్కింది.

జల విద్యుత్ ప్రాజెక్టులపై భారత్ దృష్టి

సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో భారత్ నిలిచిపోయిన జల విద్యుత్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

భారత్ దృఢ వైఖరి

పాకిస్తాన్‌తో యుద్ధం నిలిపివేసిన అనేక ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. అందులో సింధూ జలాల ఉపసంహరణ ఒకటి.

పాకిస్తాన్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఈ జలాల విషయంలో భారత్ అంగీకరించదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

#IndusWaterTreaty Breaking News in Telugu Google news Google News in Telugu India Pakistan IndusWaterTreaty Latest News in Telugu pakistan crisis Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.