📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Sivaji: హీరోయిన్ల వస్త్రధారణపై వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన శివాజీ

Author Icon By Anusha
Updated: December 24, 2025 • 11:42 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Comments on heroines’ attire.. Sivaji apologizes

‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై శివాజీ (Sivaji) చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ఆయన ఉపయోగించిన కొన్ని పదాలపై సోషల్ మీడియాలో, సినీ పరిశ్రమలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా చీరలు కట్టుకోవాలని, శరీరం ఎక్కువగా కనిపించే దుస్తులు వేసుకోవడం అందం కాదని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఈ వ్యాఖ్యల సమయంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు మహిళలను అవమానించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Read Also: Karate Kalyani: శివాజీ వ్యాఖ్యలపై కరాటే కల్యాణి ఏమన్నారంటే?

మంచి ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నా

ఈ వివాదం తీవ్రత పెరగడంతో తాజాగా శివాజీ (Sivaji) తన వ్యాఖ్యలపై చింతిస్తూ క్షమాపణ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ, తాను మాట్లాడింది అందరు మహిళలను ఉద్దేశించి కాదని స్పష్టం చేశారు. హీరోయిన్లు బయట పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు పద్ధతిగా దుస్తులు వేసుకుంటే వారికి ఇబ్బందులు కలగకుండా ఉంటాయన్న మంచి ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నానని చెప్పారు. ఎవరినీ అవమానించాలన్న ఉద్దేశం తనకు లేదని,

కానీ అనుకోకుండా రెండు అన్‌పార్లమెంటరీ పదాలు వాడటం వల్ల చాలామందికి బాధ కలిగిందని అంగీకరించారు. తాను ఎప్పుడూ స్త్రీని గౌరవిస్తానని, సమాజంలో మహిళలను తక్కువగా చూస్తున్న పరిస్థితిపై మాట్లాడాలనుకున్నానని, కానీ ఆ విషయం చెప్పే క్రమంలో తడబడ్డానని శివాజీ పేర్కొన్నారు. తన ఉద్దేశం మంచిదే అయినా, మాటల ఎంపిక వల్ల ఇండస్ట్రీలోని మహిళలు, ప్రేక్షకులు బాధపడ్డారని శివాజీ ఒప్పుకున్నారు. తన మాటలతో నొచ్చుకున్న ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని ఆయన వీడియోలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

apology video heroines dress controversy latest news Shivaji actor Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.