సంక్రాంతికి థియేటర్లలో పూనకాలు తెచ్చేందుకు సిద్ధమవుతున్న మెగాస్టార్ చిరంజీవి. ఆయన ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ చిత్రంలో వెంకటేష్ ఒక పవర్‌ఫుల్ అతిథి పాత్రలో నటిస్తుండటం విశేషం. (Chiranjeevi)ఈ సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ఆర్ యూ రెడీ అనే మాస్ పాటను విడుదల చేసింది.
Read Also: Nagrjuna: ఫిట్‌గా ఉండటానికి నాగార్జున పాటించే డైట్
ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. (Chiranjeevi) ఏంటి బాసూ సంగతీ అదిరిపోద్దీ సంక్రాంతీ, ఏంటి వెంకీ సంగతీ ఇరగతీద్దాం సంక్రాంతీ అంటూ లైన్లు అభిమానుల చేత ఈలలు వేయిస్తున్నాయి. చిరంజీవి సిగ్నేచర్ స్టెప్పులతో గ్రేస్‌ను చూపిస్తుంటే, వెంకటేష్ తనదైన కామెడీ టైమింగ్ మేనరిజమ్స్‌తో పాటలో జోష్ నింపారు. పాట చిత్రీకరణలో అనిల్ రావిపూడి తనదైన కలర్‌ఫుల్ అండ్ ఎనర్జిటిక్ మార్క్‌ను చూపించారు. మెగాస్టార్ మరోసారి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యారు. వెంకటేష్ తోడవ్వడంతో ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు మాస్ ప్రేక్షకులకు కూడా ఫుల్ మీల్స్ లాంటి విందు అని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: