అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ మూవీ వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే విడుదల చేసిన మీసాల పిల్ల, శశిరేఖ సాంగ్స్ ఆడియన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. చిరంజీవి (Chiranjeevi) హీరోగా నటిస్తున్న 157వ మూవీ ఇది. ఈ మూవీలో వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. చిరంజీవి (Chiranjeevi), వెంకటేష్ కలిసి చేస్తున్న మొదటి మూవీ ఇదే కావడం గమనార్హం.
Read Also: Nagababu: శివాజీ కామెంట్స్‌కు నాగబాబు కౌంటర్
‘ఆర్ యూ రెడీ’ పాట ప్రోమోను చిత్రబృందం విడుదల
ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. కేథరిన్ ఓ కీలక పాత్ర పోషిస్తుంది. చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెలతో కలిసి సాహు గారపాటి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.ఈ సినిమా నుంచి ‘ఆర్ యూ రెడీ’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది.
ఈ పాటలో చిరంజీవి తన మార్క్ గ్రేస్‌తో, వెంకటేష్ తనదైన స్టైల్‌తో సందడి చేస్తున్నారు. ఈ సాంగ్ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ కంప్లీట్ మాస్ సాంగ్‌ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: