📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు త్రివిక్ర‌మ్‌పై పూన‌మ్ కౌర్ ఫైర్ శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు

India Rejects: భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ పై ట్రంప్ వ్యాఖ్యలు ఖండించిన కేంద్రం

Author Icon By Uday Kumar
Updated: May 14, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి


కాల్పుల విరమణపై ట్రంప్ వ్యాఖ్యలు

భారత్ పాకిస్తాన్లు తను వాణిజ్యం ఆపేస్తాను అంటేనే కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై కేంద్రం స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన అధికార వర్గాలు అసలు వాణిజ్యం అంశం ప్రస్తావనే రాలేదని తేల్చి చెప్పాయి. అంతకుముందు ట్రంప్ తన ప్రయత్నాల వల్లే భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొందన్న వ్యాఖ్యలు చేశారు. అయితే ట్రంప్ చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుపట్టింది. ముందుగా ఇస్లామాబాద్ నుంచి ఢిల్లీకి ఫోన్ వచ్చిన తర్వాతే కాల్పుల విధమన చర్చలు జరగాయని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

ట్రంప్ వ్యాఖ్యల తీవ్రత

సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించడానికి కొన్ని నిమిషాల ముందు ట్రంప్ మాట్లాడుతూ భారతదేశం పాకిస్తాన్లు తమ మధ్య ఘర్షణను ముగించాలి లేదంటే అమెరికా వాణిజ్య సహకారం నిలిపి వేస్తుందని నేను చెప్పాను అని అన్నారు. అలాగే ఈ రెండు దేశాల మధ్య ఉన్న ఘర్షణ ఒక అనుయుద్ధంగా మారి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు.

వాణిజ్యం ప్రస్తావనే లేదు – భారత వివరణ

కానీ అధికార వర్గాలు వెలడించిన ప్రకారం ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైన తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వన్స్ ప్రధాని మోదీతో మాట్లాడారు. అమెరికా సెక్రెటరీ మార్కో రుబియో విదేశాంగ మంత్రి జయశంకర్తో, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్తో మాట్లాడారు. ఈ చర్చలలో వాణిజ్యానికి ఎలాంటి ప్రస్తావన రాలేదని పేర్కొన్నాయి.

పాకిస్తాన్ స్వయంగా కోరింది – ప్రధాని మోదీ

ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోదీ కూడా పాకిస్తాన్ స్వయంగా యుద్ధం ఆపాలని కోరిందని, భారత దాడుల తీవ్రతను తట్టుకోలేక అలా చేయాల్సి వచ్చిందని వివరించారు.

మూడో పార్టీ మధ్యవర్తిత్వం – భారత వైఖరి

భారత ప్రభుత్వం ఎప్పటి నుంచో పాక్తో సంబంధిత సమస్యలలో ముఖ్యంగా కాశ్మీర్ వంటి అంశాలలో మూడో పార్టీ మధ్యవర్తిత్వానాన్ని తిరస్కరిస్తూ వస్తుంది.

ప్రతిపక్షాల స్పందన

అయితే ట్రంప్ తాజా ప్రకటనతో ప్రతిపక్షాలు మేల్కొన్నాయి. అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలపై ప్రధానిమంత్రి మోదీ స్పందించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. అలాగే పెహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్ పై సైనిక చర్యలు నిలిపివేత అంశాలపై పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని మరోసారి డిమాండ్ చేసింది.

Ceasefire Agreement ceasefire deal Donald Trump Google news Google News in Telugu india pak war Operation Sindhoor Paper Telugu News PMModi Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.