📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Bigg Boss 9: ఇమ్మానుయేల్‌ జర్నీ వీడియో ప్రోమో విడుదల

Author Icon By Aanusha
Updated: December 17, 2025 • 7:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Bigg Boss 9: The promo for Emmanuel’s journey video has been released

మరికొద్ది రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) పూర్తికానుంది. సీజన్ 9 ఎవరు విన్నర్ అవుతారు అని ప్రేక్షుకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో తనూజ, కళ్యాణ్ అభిమానులు పోటీపడి పోస్ట్ లు షేర్ చేస్తున్నారు. ఓటింగ్ లోనూ ఈ ఇద్దరే టాప్ లో ఉన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు విన్నర్, మరొకరు రన్నర్ అవ్వనున్నారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 మెంబర్స్ ఉన్నారు. తనూజ, కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్, సంజన, డీమన్ పవన్ హౌస్ (Bigg Boss 9) లో ఉన్నారు. వీరిలో ఒకరు విన్నర్ అవ్వనున్నారు. కాగా ప్రస్తుతం చివరివారం ఓటింగ్ జరుగుతుంది. ఈవారం ఓటింగ్ లో కళ్యాణ్ తనూజ టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్నారు. కాగా ఆతర్వాత ఇమ్మాన్యుయేల్, డీమన్ పవన్ కొనసాగుతున్నారు.

Read Also: Bigg Boss 9: నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల

మొదటిగా బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌ ఇమ్మానుయేల్‌కి సంబంధించిన జర్నీ వీడియోకి సంబంధించిన ప్రోమో వచ్చింది.బిగ్ బాస్ హౌస్‌లో ఇమ్మానుయేల్ ఈ 100 రోజుల ప్రయాణంలో ప్రతి మూమెంట్‌ని గుర్తు చేశారు బిగ్ బాస్. తన తల్లి హౌస్‌లోకి వచ్చినప్పటి ఫొటో చూసి ఎమోషనల్ అయ్యాడు ఇమ్మానుయేల్. ఇక ఫైనలిస్ట్‌ల గురించి బిగ్ బాస్ మాట్లాడే మాటలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండగా.. ఇమ్మానుయేల్ గుండెల్ని తాకే మాటలు మాట్లాడారు బిగ్ బాస్.

అనుభవంలోకి వస్తేనే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుంది. చిన్నప్పటి నుంచి కష్టాలను అనుభవించిన వాళ్లకే ఓ చిన్న చిరునవ్వు బలమెంతో తెలుస్తోంది. ఈ ఇంట్లో అదే మీ బలంగా ముందుకు సాగారు. అదే నవ్వును పంచుతూ అందరితో కలిసిపోయారు. నవ్వులైనా నామినేషన్ అయినా.. మాటలే మీ ఆయుధాలు.. తెలివితేటలే మీగేమ్ ప్లాన్. ప్రేక్షకుల్ని ఎలా ఎంటర్‌టైన్ చేయాలనే విషయం ఈ ఇంట్లో మీకన్నా ఎక్కువగా ఎవ్వరికీ తెలియదు.

ఇమ్మానుయేల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ చేయలేదు

అసలు ఈ సీజన్‌లో ఇమ్మానుయేల్ లేకపోతే అసలు ఊహించుకోవడమే కష్టం అనేట్టుగా అద్దరగొట్టాడు. జబర్దస్త్ కమెడియన్లు ఇప్పటివరకూ చాలామంది బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చారు వెళ్లారు కానీ.. ఇమ్మానుయేల్ చేసినంత ఎంటర్టైన్మెంట్ ఎవరూ చేయలేదు. కేవలం జనాల్ని నవ్వించడం మాత్రమే కాదు.. టాస్క్‌లలో కూడా ఇరగదీశాడు. ఏ టాస్క్ ఇచ్చినా కూడా గెలుపు నాదే అన్నంత కసిగా ఆడాడు ఇమ్మానుయేల్. సిచ్యువేషన్ ఏదైనా సరే.. అక్కడ తన మార్క్ ఉండేట్టుగా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవాడు.

నిజానికి కామెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు. జోక్ వేశామంటే అవతల వాళ్లు ఎలా రిసీవ్ చేసుకుంటారానే అనే భయం ఉంటుంది. ఒక్కొక్కరు నవ్వుతారు.. కొంతమంది సీరియస్ అవుతారు. బిగ్ బాస్ సీజన్ 9 ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్‌గా నిలిచాడు ఇమ్మానుయేల్. బిగ్ బాస్ టైటిల్ ఎవరిది అంటే.. అయితే కళ్యాణ్, లేదంటే తనూజ అంటున్నారు కానీ.. నిజమైన విన్నర్ అంటే మాత్రం అది ఇమ్మానుయేలే. బట్ కమెడియన్‌ని కమెడియన్‌లాగే చూస్తారు కాబట్టి.. విన్నర్లు కాలేదు. ఇప్పుడు ఇమ్మానుయేల్ విషయంలో అదే అయ్యింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Bigg Boss Telugu Season 9 Emmanuel Bigg Boss Entertainer of the House latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.