📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్ బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? సినీ జర్నలిస్టుకి కిరణ్ అబ్బవరం కౌంటర్

Latest News: Bigg Boss 9: నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల

Author Icon By Anusha
Updated: December 16, 2025 • 12:34 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Bigg Boss 9: Promo for today’s episode released

బిగ్‌బాస్ తెలుగు 9 (Bigg Boss 9) వ సీజన్ చివరి దశకు చేరుకుంది. ఈ వారంతో షో ముగియనుండగా, వచ్చే ఆదివారం గ్రాండ్ ఫినాలేలో విజేత ఎవరో తేలనుంది. గత వారం భరణి, సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడంతో ప్రస్తుతం హౌజ్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీరంతా ఫైనల్‌కు చేరుకుని టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ అవ్వనున్నారు. కాగా కళ్యాణ్, తనూజ మధ్య రేస్ నడుస్తుంది.

Read Also:  Bigg Boss 9: హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన భరణి

ఈ ఇద్దరిలోనే ఒకరు విన్నర్ అవ్వనున్నారని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. బయట ఓటింగ్ లో కూడా కళ్యాణ్ టాప్ లో దూసుకుపోతున్నాడు. కళ్యాణ్ తర్వాత తనుజ ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. ఇక నేటి ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో వన్స్ మోర్ అంటూ మరో టాస్క్ ఇచ్చాడు. బెలూన్ టాస్క్ ఇచ్చాడు. హౌస్ లో ఉన్న ఆరుగురిలో జోడీగా ఎవరు ఉంటారు అనేది మీరే డిసైడ్ అవ్వండి అని చెప్పారు.

దాంతో హౌస్ (Bigg Boss 9)లో డిస్కషన్ మొదలైంది. సంచలక్ గా డీమాన్ ఉండాలని ఇమ్మాన్యుయేల్ , తనూజ చెప్పడంతో డీమన్ దానికి ఒప్పుకోలేదు. నేను కూర్చోను, కావాలంటే మీరు కూర్చోండి అంటూ తేల్చిచెప్పాడు. ఈరోజు నన్ను కూర్చోబెడితే .. రేపటి నుంచి కూర్చోవాల్సి వచ్చినప్పుడు నేను అస్సలు కూర్చోను అని చెప్పాడు. దాంతో తనూజకి సుర్రుమని కాలింది.. ‘అలా అయితే ఇమ్మానుయేల్‌ని కూర్చోబెట్టి.. నీకు మూడో స్టార్ కూడా పెట్టేద్దామా’ అని అన్నది.

డీమాన్ పవన్‌ సంచాలక్‌కే పరిమితం

నాకు ఓటు అప్పీల్ రాలేదు కదా అంటే.. మేడమ్ గారు వినే పరిస్థితుల్లో లేదు. వాయిస్ రేస్ చేయడం స్టార్ట్ చేసింది. ‘నీకు రెండు స్టార్లు వచ్చాయి.. నాకు ఒక్క స్టార్ కూడా రాలేదు కాబట్టి నేనే ఆడతా’ అని అన్నది తనూజ . ఇక కాదూ లేదూ కుదరదు అంటే తనూజ ఊరుకుంటుందా? కాబట్టి, ఆమెతో వాదించలేక మౌనంగా ఉండిపోయాడు డీమాన్.

తనూజ అనుకున్నట్టుగానే తన జోడీ కళ్యాణ్‌తో కలిసి టాస్క్ ఆడింది. అటు ఇమ్మానుయేల్.. తన మమ్మీ సంజనాతో కలిసి ఆడాడు. పాపం డీమాన్ పవన్‌ సంచాలక్‌కే పరిమితం అయ్యాడు.అయితే బెలూన్ గాల్లో ఉన్నప్పుడు బెల్ కొట్టకుండా గోళ్లు గిల్లుకున్న తనూజ.. బెలూన్ పగిలిపోయిన తరువాత బెల్ కొట్టి అతి తెలివి చూపించింది.

అడ్డమైన వాదనకి దిగింది తనూజ

మేమే గెలిచాం అన్నట్టుగా వాదనకు దిగింది. దాంతో ఇమ్మానుయేల్.. అదేంటి బెలూన్ గాల్లో ఉన్నప్పుడు బెల్ కొట్టాలి కదా అని అడిగాడు. ఎందుకు కొడతాం.. మా దగ్గర ఇంకా బెలూన్స్ ఉన్నాయి కదా.. మా బెలూన్ ఎక్కువ సేపు గాల్లో ఉంది’ అంటూ ఎటాకింగ్‌కి దిగింది తనూజ.గాల్లో ఎక్కడుంది? ఇద్దరి మూడు మూడు బెలూన్స్ పగిలిపోయాయి కదా అని ఇమ్మానుయేల్ అంటే.. ఎక్కువసేపు గాల్లో ఉన్నది మా బెలూన్ అంటూ అడ్డమైన వాదనకి దిగింది తనూజ.

అక్కడ టాస్క్ ఏంటీ.. బెలూన్ పగిలిపోకుండా ఉండాలి.. అప్పుడు గంట కొట్టాలి. కానీ అక్కడ బెలూన్ పగిలిపోయినా.. గాల్లో ఉందంటూ వాదించింది తనూజ. ఓ పక్క తన టీంలోనే ఉన్న కళ్యాణ్.. ‘బెల్ కొట్టూ.. బెల్ కొట్టూ.. డిస్ క్వాలిఫై అయిపోయాయి మూడూ’ అని ఒప్పుకుంటున్నా.. తనూజ మాత్రం అడ్డదిడ్డంగా వాదిస్తూనే ఉంది. మరి డీమాన్ పవన్ ఏ నిర్ణయం తీసుకున్నాడో చూద్దాం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Balloon Task Bigg Boss Telugu Demon Today Episode Promo

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.