📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా? శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా బాస్కెట్ బాల్ కోర్ట్ లో ప్లేయర్ మృతి మహిళపై అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్ ఫంకీ టీజర్ విడుదల డ్యూడ్ ట్రైల‌ర్ లో హైలైట్స్ మాస్ జాతర నుంచి హుడియో హుడియో సాంగ్ మిత్ర‌మండ‌లి ట్రైల‌ర్ హైలైట్స్ బంగారం నిల్వలు పెంచుతున్న కేంద్ర బ్యాంకులు బిగ్‌బాస్ ఫైర్‌స్ట్రామ్ ప్రోమో చూసారా?

Latest News: Bigg Boss 9: తనూజ, భరణి లతో ఆట ఆడేసుకున్న నాగ్

Author Icon By Anusha
Updated: October 11, 2025 • 2:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి
Bigg Boss 9

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9  (Bigg Boss Season 9) లో మరో సూపర్ స్యాటర్డే రానుంది. ప్రేక్షకులు ఎప్పటిలాగే ఈరోజు నాగార్జున ఎపిసోడ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.నాగార్జున హౌస్‌మేట్స్‌కి ఇచ్చే క్లాస్ ఎప్పటిలాగే హైలైట్‌గా మారుతుంది. అందుకే శనివారం ప్రోమో విడుదల అవ్వగానే సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.

Priyanka Arul Mohan: ఎక్స్‌పోజింగ్ ఫోటోస్ వైరల్.. ప్రియాంక తీవ్ర హెచ్చరిక

తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున (Nagarjuna) మాస్ అవతారంలో అదరగొట్టారు. “మమమాస్” అంటూ ఆయన ఇచ్చిన ఎంట్రీకి స్టేజ్ మొత్తమే ఊగిపోయింది. ఆయన ఎంట్రీతోనే ప్రేక్షకుల్లో ఎనర్జీ పెరిగింది. తన సొంత సినిమాలోని “మాస్” పాటను మళ్లీ రీక్రియేట్ చేస్తూ, ఆ వైబ్రేషన్‌ను మళ్లీ తెచ్చారు.

ఆరు పదుల వయసులోనూ ఇంత స్టైలిష్‌గా, యంగ్‌ కనిపిస్తున్నారు నాగ్‌. అభిమానులు “మాస్ నాగ్ ఈజ్ బ్యాక్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇక స్టైలీష్ గా ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఆ తర్వాత ఒక్కొక్కరికి వాయింపు మొదలుపెట్టారు.

నువ్వు వాళ్లందరి తరుపున పోరాడి ఉండి ఉంటే

ముందుగా తనూజ (Tanuja) తో మాట్లాడుతూ..బెడ్ టాస్కులో నువ్వు ఆడిన తీరు కరెక్టేనా.. వాళ్లు ఆడపిల్లలందర్నీ తోసేద్దాం అని అన్నారు. నువ్వు వాళ్లందరి తరుపున పోరాడి ఉండి ఉంటే.. చివరకు నీ వరకు వచ్చేది కాదు కదా అంటూ నిలదీశారు.ముందే వెళ్లిపోయిన సంజన (Sanjana) మీరంతా కలిసి ఆడండి.. విడివిడిగా ఆడొద్దని చెప్తూనే ఉంది..

అప్పుడైనా నీకు బుద్ది రావాలి కదా.. భరణి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్.. ఈ ముగ్గురు నిన్ను తీయరు అని అనుకున్నావా.. ? అంటూ సీరియస్ అయ్యారు. ఆ తర్వాత దివ్యతో మాట్లాడుతూ.. శ్రీజ విషయంలో భరణి ప్రవర్తించిన తీరు కరెక్టేనా అని అడిగారు.ఇక చివరకు భరణికి క్లాస్ స్టార్ట్ చేశారు.

వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు

ఎంతో ఎదగాల్సిన నువ్వు పడింది బెడ్ పై నుంచి కాదు..మా దృష్టిలో నుంచి కూడా కిందపడ్డావు. వారంలో తప్పులు చేసి వీకెండ్ లో ఒప్పుకుంటే కుదరదు.. నీకు స్పష్టంగా అర్థం కావడం కోసం.. జనం నీ గురించి ఏమనుకుంటున్నారో వాళ్లతోనే చెప్పిస్తా అంటూ ఓ అమ్మాయితో మాట్లాడించారు.

ఆమె మాట్లాడుతూ.. భరణి గారు.. మీకు బాండింగ్స తప్ప ఆట కనిపించడం లేదు.. మిమ్మల్ని అసలు బిగ్ బాస్ (Bigg Boss 9) ఉంచబుద్ది కావడం లేదు అంటూ చెప్పేసింది. ఇక ఈరోజు సాయంత్రం ఎపిసోడ్ లో మాత్రం ఒక్కొక్కరికి ఇచ్చిపడేసినట్లు తెలుస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Bigg Boss promo Bigg Boss Telugu 9 latest news Nagarjuna mass entry Tanuja Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.