ఛావా కథ ఏమిటంటే!

ఛావా కథ ఏమిటంటే!

శివాజీ మహారాజ్ గురించి మన చరిత్రలో చాలానే చదువుకున్నాం. అయితే అంతటి మహా వీరుడికి పుట్టిన శంభాజీ గురించి చరిత్ర పుటల్లో ఎక్కువగా ఉండదు. అలాంటి శంభాజీ కథను లక్ష్మణ్ ఉటేకర్ ఇప్పుడు అందరి ముందుకు తీసుకు వచ్చాడు. హైందవ స్థాపన, స్వరాజ్యం కోసం శంభాజీ చివరి వరకు ఎలా పోరాడి? శత్రువులకు సింహా గర్జన ఏంటో రుచి చూపించిన వీరుడి కథే ఈ ఛావా.

Advertisements

కథ:

దక్కన్ పీఠభూమిని, మరాఠా సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవచ్చని ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) అనుకుంటాడు. మొఘలులకు ప్రాణమైన బర్హాన్ పూర్ మీద శంభాజీ మహారాజ్ (విక్కీ కౌశల్) అనూహ్యంగా దాడి చేసి మొత్తం కొల్లగొట్టేస్తాడు. దీంతో ఔరంగజేబు మళ్లీ ఓడిపోయినట్టు అవుతుంది. ఇక శంభాజీని పట్టుకుని వధించాలని కంకణం కట్టుకుంటాడు ఔరంగజేబు. అలా ఢిల్లీ నుంచి రాయ్ ఘడ్‌కి ఔరంగజేబు పయనం సాగుతుంది. మరో వైపు శంభాజీ తన సామ్రాజ్య పరిరక్షణ గురించి అనేక యుద్దాలు చేస్తుంటాడు. శంభాజీ రాజ్యంలో అంతర్గత పోరు కూడా ఉంటుంది. శంభాజీని వెన్నుపోటు పొడిచేది ఎవరు? చివరకు శంభాజీ బంధీగా ఔరంగజేబుకు ఎలా చిక్కుతాడు? శంభాజీ ఎలా వీర మరణం పొందుతాడు? ఈ కథలో శంభాజీ భార్య ఏసుబాయి (రష్మిక) పాత్ర ఏంటి? అనేది థియేటర్లో చూడాల్సిందే.స్కూల్ పాఠ్యాంశాలు, చరిత్ర పుస్తకాల్లో ఎక్కడా కూడా శంభాజీ మహారాజ్ గురించి ఎక్కువగా కనిపించదు. ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి కనిపించినంతగా ఈ శంభాజీ గురించి కనిపించదు. ఇక మన చరిత్ర పుస్తకాల్లో ఎక్కువగా మొఘలుల పరిపాలన గురించే ఉంటుంది. ఢిల్లీ సుల్తానుల కాలం నాటి గురించి అందుబాటులో ఉన్నంత సమాచారం.ఈ శంభాజీ గురించి ఉండదు.

దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్

శంభాజీ మహారాజ్ గురించి చాలానే రీసెర్చ్ చేసి దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ ఈ మూవీని తీశాడనిపిస్తోంది.ఇక ఛావా అనే టైటిల్ ఎందుకు పెట్టాడు.అనే దానికి సినిమా చూస్తేనే తెలుస్తుంది. శివాజీ మహారాజ్ సింహం,అతని కొడుకు శంభాజీ ఛావా.సింహ గర్జన అంటే ఏంటో,విక్కీ కౌశల్ తన నటనతో చూపించేశాడు. కంటి చూపుతోనే చంపేస్తా అని మన హీరోలు డైలాగ్ చెబుతుంటారు. కానీ విక్కీ కౌశల్ ఈ ఛావాలో అది చేసి చూపించాడు. ఎంతలా హింసిస్తున్నా,కళ్లు పొడిచినా, నాలుక పీకినా చెక్కు చెదరని సంకల్పంతో, బెరుకు అనేది చూపించకుండా నటించిన విక్కీ కౌశల్‌కు అందరూ ఫిదా అవ్వాల్సిందే.విక్కీ కౌశల్ ఎంట్రీ తన సామ్రాజ్యం అందులో జరిగే అంతర్గత కుమ్ములాట శంభాజీని వెన్నుపోటు పొడించేందుకు ఇంట్లోనే మంతనాలు జరపడం, ఔరంగజేబు దక్కన్ మీద దండయాత్రకు బయల్దేరడం వంటి సీన్లతో సాగిపోతుంది. ఇక సెకండాఫ్‌లో చాలా వరకు యాక్షన్ సీక్వెన్స్‌లతోనే చుట్టేశారు. ఒక్కో పద్దతిలో ఒక్కో చోట ఔరంగజేబు సైన్యాన్ని ఛావా మట్టు బెడుతుంటాడు. ఇక చివర్లో వెన్నుపోటు వల్ల ఛావా చిక్కుతాడు. అక్కడి చివరి వరకు అంటే ఓ 20 నిమిషాల పాటు సినిమా ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.ఎంతలా హింసించినా కూడా తన ధర్మాన్ని, స్వరాజ్య నినాదాన్ని, మతాన్ని వదిలి పెట్టని శంభాజీ మహారాజ్‌ను చూస్తే గుండె కదిలిపోతుంది.

cHHAAVA

నటీనటుల ప్రదర్శన:

విక్కీ కౌశల్ ఈ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్నాడు. అతని కళ్లతోనే తాను ఎంతటి శూరుడో ప్రదర్శించాడు. హింసను తట్టుకుని కూడా ధైర్యంగా నిలబడే శంభాజీ పాత్రలో విక్కీ తన నటనతో ఒదిగిపోయాడు. రష్మిక పాత్ర హుందాగా ఉండి, ఆమెకు మంచి స్కోప్ ఉన్నది. అక్షయ్ ఖన్నా ప్రతినాయకుడిగా మెప్పించాడు.లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో సినిమా అత్యద్భుతంగా రూపొందింది. బ్యాక్‌డ్రాప్, సెట్టింగులు మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లేలా ఉన్నాయి. యాక్షన్ సన్నివేశాలు గొప్పగా చిత్రీకరించారు. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం మాత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కొన్ని సన్నివేశాల్లో బీజీఎం బాగుండగా, కొన్ని చోట్ల అంతగా ప్రభావం చూపలేదు.

“ఛావా” శంభాజీ మహారాజ్ వీరత్వాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఎమోషనల్‌గా కదిలిస్తుంది. విక్కీ కౌశల్ నటన, గ్రాండ్ విజువల్స్, యుద్ధ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణలు. హిస్టారికల్ డ్రామాలు ఇష్టపడేవారికి తప్పకుండా నచ్చే చిత్రం.

Related Posts
సైన్స్ ఫిక్షన్ థ్రిల్ల‌ర్ మూవీ – మూడో వ‌ర‌ల్డ్ వార్ వ‌స్తే
kadaisi ulaga por 1726063610

ఇటీవల, హిప్ హాప్ తమిళ్ అన్న పేరు ఇప్పుడు తమిళ, తెలుగు మరియు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా తెలిసినది. ఈయన, ధృవ మ్యూజిక్ డైరెక్టర్‌గా పేరుపెట్టుకున్న హిప్ Read more

Narne nithiin;త్వరలోనే పెళ్లి డేట్‌ నిర్ణయం,
narne nithin

‘మ్యాడ్’ సినిమాతో హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్‌ ఎంగేజ్‌మెంట్‌ ఇటీవల ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ భార్య ప్రణీత సోదరుడు అయిన నితిన్, ఈ వేడుకలో Read more

సమంత డైవర్స్ – అక్కినేని ఇంట్లో గుడ్ న్యూస్ కి కారణమా ?
నాగార్జున కుటుంబంలో పండగ వాతావరణం

నాగచైతన్య సమంత వివాహం తరువాత కొన్ని ఈ జంట సినీ ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగింది వీరు డైవర్స్ వీరు తీసుకోవటం తో అభిమానుల్లో తీవ్ర Read more

గాంధీ తాత చెట్టు విడుదలకు సిద్ధం
గాంధీ తాత చెట్టు విడుదలకు సిద్ధం

దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతివేణి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఈ చిత్రానికి పద్మావతి మల్లాది దర్శకత్వం వహించగా, శేష Read more

×