Veera Dheera Soora movie షాకిచ్చేలా వీర ధీర శూర వసూళ్లు, ఎన్ని కోట్లంటే

Veera Dheera Soora movie : షాకిచ్చేలా వీర ధీర శూర వసూళ్లు, ఎన్ని కోట్లంటే

చియాన్ విక్రమ్ నటించిన ‘వీర ధీర సూర‘ విడుదల రోజు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నా, తర్వాత బాక్సాఫీస్‌పై నిలదొక్కుకుంది. తొలిరోజు భారీగా ఓపెనింగ్స్ రాకపోయినా, వీకెండ్, రంజాన్, ఉగాది పండుగల ప్రభావంతో సినిమా హోల్డ్ చేసింది. అయితే, ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్లు ఎలా ఉన్నాయి ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం యాక్షన్, కమర్షియల్ ఫార్ములాలతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 27న విడుదలైన ఈ సినిమా న్యాయపరమైన సమస్యల వల్ల మధ్యాహ్నం వరకూ ప్రదర్శనలు రద్దయ్యాయి. అయినప్పటికీ, తర్వాత మంచి రెస్పాన్స్‌ను సంపాదించుకుంది.విక్రమ్ సరసన దుషార విజయన్ హీరోయిన్‌గా నటించగా, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడి, 30 ఇయర్స్ పృథ్వీ, సిద్ధిఖీ వంటి నటులు కీలక పాత్రల్లో మెప్పించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా, హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా శిబు ఈ సినిమాను రూ. 60 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం, లాభాల్లోకి రావాలంటే రూ. 31 కోట్ల షేర్, రూ. 64 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సిన అవసరం ఉంది.

Advertisements
Veera Dheera Soora movie షాకిచ్చేలా వీర ధీర శూర వసూళ్లు, ఎన్ని కోట్లంటే
Veera Dheera Soora movie షాకిచ్చేలా వీర ధీర శూర వసూళ్లు, ఎన్ని కోట్లంటే

తొలిరోజు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ రాకపోయినా, వరుసగా ఐదు రోజుల పాటు పుంజుకుని ప్రపంచవ్యాప్తంగా రూ.23.65 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. 2025లో విడుదలైన ముర్ముర్, గేమ్ ఛేంజర్, కాదలిక్క నెరమిల్లయై వంటి తమిళ సినిమాలను కలెక్షన్ల పరంగా అధిగమించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ‘డ్రాగన్’ (రూ.88.38 కోట్లు) టాప్‌లో ఉండగా, ‘విదాముయార్చి’ (రూ.78.58 కోట్లు), ‘మద గజ రాజా’ (రూ.47.57 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.వీకెండ్, పండగ సీజన్ ముగిసినప్పటికీ ‘వీర ధీర సూర’ స్థిరంగా కొనసాగుతోంది. 6వ రోజు ఉదయం షోలకి 14.38%, మ్యాట్నీలకు 25.28%, సెకండ్ షోలకు 23.93%, చివరి షోలకి 30.62% ఓవరాల్‌గా 23.55% ఆక్యుపెన్సీ నమోదైంది. చెన్నైలో 430 షోలు, బెంగళూరులో 197, మధురైలో 105, కోయంబత్తూరులో 156 షోలు ప్రదర్శించబడ్డాయి.సాక్‌నిక్ రిపోర్ట్ ప్రకారం, మంగళవారం ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.2.4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో మొత్తం కలెక్షన్లు రూ.31 కోట్లకు చేరాయి. ఇందులో ఇండియాలో రూ.27.6 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.3.4 కోట్లు వచ్చాయి. ఈ సినిమా బ్రేక్‌ఈవెన్ దశ చేరుకోవడానికి ఇంకా దూరమే. రానున్న రోజుల్లో విక్రమ్ మ్యాజిక్ చేస్తాడో లేదో చూడాలి!

Related Posts
ఈ సినిమాను OTTలో చూడండి
యూఐ సినిమా

అంతటా ఆసక్తిని రేపిన సినిమా, ఉపేంద్ర మాస్టర్ పీస్ ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కోసం సిద్ధమైంది. సినిమాకు సంబంధించిన టాక్ కూడా నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. Read more

శోభిత ధూళిపాళ్లకు సమంత వార్నింగ్
samantha

నాగచైతన్య శోభిత ధూళిపాళ సీక్రెట్ డేటింగ్ నుండి పెళ్లి సందడి వరకు ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగచైతన్య మరియు శోభిత ధూళిపాళ జంటను కొట్టిన ఫోటోలు మరియు Read more

Rana-Naga Chaitanya: లైవ్‏లో ఆ హీరోయిన్‏కు సర్‏ప్రైజ్ కాల్..
rana daggubati naga chaitanya

నాగచైతన్య, రానా టాక్ షోలో ఆసక్తికరమైన సంభాషణలు అక్కినేని నాగచైతన్య ఇటీవలే కుటుంబం నుండి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. డిసెంబర్ 4న, ఆయన శోభిత ధూళిపాళ్లతో Read more

Keerthy Suresh: కీర్తి సురేశ్ ను ఆటపట్టించిన ఐస్ క్రీమ్ వెండర్
Keerthy Suresh: కీర్తి సురేశ్ vs ఐస్ క్రీమ్ వెండర్ – ఫన్నీ వీడియో వైరల్!

ఓ ఐస్ క్రీమ్ దుకాణంలో నటి కీర్తి సురేశ్ కు ఓ ఫన్నీ అనుభవం ఎదురైంది. పలు చోట్ల ఐస్ క్రీమ్ దుకాణాల్లో వెండర్లు ఐస్ క్రీమ్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×