కావలసిన పదార్థాలు
- రాగులు – ఒక కప్పు
- మెంతులు – పావు చెంచా
- దనియాల పొడి – అరకప్పు
- మినప్పప్పు – అరకప్పు
- కారం – అరచెంచా
- ఉప్పు – సరిపడినంత
- ఉల్లిపాయ ముక్కలు – తగినంత
- క్యాప్సికం తరుగు – తగినంత
- క్యారెట్ తురుము – అరకప్పు
- నూనె – ఒక అరకప్పు
తయారు చేసే విధానం
ముందురోజు రాగుల్నీ, మినప్పప్పునీ, మెంతుల్ని సరిపడా నీళ్లలో (water) నానబెట్టుకుని మరుసటి రోజు గట్టి పిండిలా రుబ్బుకోవాలి. ఈ పిండిలో దనియాల పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి మరో నాలుగు గంటలు నాననివ్వాలి. ఆ తరువాత స్టవ్ మీద పెనం పెట్టి పిండిని ఊతప్పం మాదిరిగా పరచి, పైగా ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం (Capsicum) తరుగు, క్యారెట్ తురుము చల్లి, నూనె వేసి ఎర్రగా కాల్చుకుంటే రుచికరమైన ఊతప్పం సిద్ధం.
Read also: hindi.vaartha.com
Read also: