Ragi Pongnalu-కావలసిన పదార్థాలు:
- రాగిపిండి – ఒక కప్పు
- బొంబాయి రవ్వ – ఒక కప్పు
- పెరుగు – ఒక కప్పు
- నీళ్లు – ఒకటిన్నర కప్పు
- ఉప్పు – తగినంత
- వంటసోడా – చిటికెడు
- నూనె – అర కప్పు
- సెనగపప్పు – అరచెంచా
- మినప్పప్పు – అరచెంచా
- ఆవాలు – అరచెంచా
- జీలకర్ర – అరచెంచా
- పచ్చిమిర్చి – రెండు
- ఉల్లిపాయముక్కలు – అరకప్పు
- కొత్తిమీర తరుగు – టేబుల్‌స్పూన్
- క్యారెట్లు – రెండు
తయారు చేసే విధానం:
ఓ గిన్నెలో రాగిపిండి, బొంబాయిరవ్వ, పెరుగు, తగినంత ఉప్పు (salt) వేసి, నీళ్లు పోసి కలిపి మూత పెట్టాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి చెంచా నూనె వేసి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేయించుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ (onion) ముక్కలు, కొత్తిమీర తరుగు, క్యారెట్ తురుము వేసుకుని రెండు మినిట్లు ఈ మిశ్రమం, మూడు నిమిషాలు వేయించాలి. కొద్దిగా వంటసోడా రాగిపిండిలో వేసి మరోసారి కలపాలి. స్టవ్ మీద గుంట పొంగనాల పాను పెట్టి ఈ పిండిని వేస్తూ వేసుకుని, నూనెతో కొంచెం రుచి చేర్చి సర్వ్ చేయాలి.
Read also: hindi.vaartha.com
Read also: