Pumpkin Dal:కావలసిన పదార్థాలు
- కందిపప్పు: ముప్పావు కప్పు
- తీపి గుమ్మడి ముక్కలు: ఒకటిన్నర కప్పు
- టమాటలు: రెండు
- నెయ్యి
- జీలకర్ర: అర చెంచా
- అల్లంతరుగు: ఒక చెంచా
- పచ్చిమిర్చి : ఒకటి
- కారం: చెంచా
- పసుపు: పావు స్పూను
- ఉప్పు: తగినంత
- గరంమసాల: అర చెంచా
- కస్తూరీమేథీ: చెంచా
- బెల్లంతరుగు : చెంచా
- కొత్తిమీర : ఒక కట్ట
- నిమ్మరసం: రెండు చెంచాలు
తయారు చేసే విధానం
ముందుగా కందిపప్పును కుక్కర్ లో వేసి సరిపడా నీళ్లు పోసి, మూత పెట్టి మూడు కూతలు వచ్చేవరకు ఉడికించాలి.
స్టౌ మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీలకర్ర వేయించి అల్లంతరుగు, కరివేపాకు(Curry leaves), పచ్చిమిర్చి ముక్కలు, టమాట(tomato) ముక్కలు, గుమ్మడిముక్కలు వేసి వేయించి పావుకప్పు నీల్లు పోయాలి.
ఒక నిమిషం తరువాత ఉప్పు, పసుపు, కారం, గరంమసాలా వేయాలి.
గుమ్మడిముక్కలు మెత్తగా అయ్యాక ఉడికించి పెట్టుకున్న పప్పు, కస్తూరీమేథీ, కొత్తిమీర తరుగు, నిమ్మరసం, బెల్లం తరుగు వేసి బాగా కలిపి పప్పు బాగా ఉడుకుతున్నప్పుడు దింపాలి.
Read also:hindi.vaartha.com
Read also: Parsi Dal Recipe:పార్సీ దాల్ రెసిపీ