Pulao Recipe in Telugu కావలసినవి:
- నానబెట్టి, నీళ్లు వాడిన బాస్మతీ బియ్యంకప్పు (ఆరెంజ్ రైస్ కోసం),
- టొమాటో, కాశ్మీరీచిల్లీ ప్యూరీ పావుకప్పు,
- నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు,
- కారం అరటీస్పూన్
- జీలకర్ర పావు టీస్పూన్
- అల్లం పేస్టు టీస్పూన్
- ఉప్పు అన్నం తగినంత
తెల్ల అన్నం కోసం:
- నెయ్యిలో జీలకర్ర,
- అల్లంవెల్లుల్లి పేస్టు వేసి అన్నం కలిపి పెట్టుకోవాలి
పచ్చఅన్నం కోసం:
- నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు,
- జీలకర్ర పావుటీస్పూన్,
- అల్లం పేస్టు టీస్పూన్,
- పచ్చిమిర్చి పేస్టు టీస్పూన్,
- పాలకూరపూరీ అరకప్పు,
- ఉప్పు సరిపడ
తయారీ విధానం:
కడాయిలో నెయ్యి వేసి వేడిచేసి జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతుండగా బియ్యం, అల్లం పేస్టు, రెడ్ చిల్లీ పేస్టు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత టొమాటో(Tomato) ప్యూరీ, ఉప్పు, కప్పు నీళ్లు పోసి మూతపెట్టి ఉడికించాలి. మరో కడాయిలో నెయ్యి(ghee) వేడిచేసి జీలకర్ర వేసి చిటపటలాడుతూ పసుపు, బియ్యం, గ్రీన్ చిల్లీ, అల్లం పేస్టు, ఉప్పు వేసి కలపాలి. అరకప్పు నీళ్లు పోసి మరిగించి.. పాలకూర ప్యూరీ కలిపి మూతపెట్టి ఉడికించాలి. ప్లేటులో కాషాయ, తెలుపు, పచ్చరంగు పులావును వరుసగా అమరిస్తే మూడు రంగుల పులావ్ సిద్ధం.
Read also:hindi.vaartha.com