Pepper Rice: కావలసిన పదార్థాలు:
- అన్నం: పెద్ద కప్పు
- చింతపండు: నిమ్మకాయంత
- ఎండు మిర్చి: నాలుగు
- మిరియాలు: ఒకటిన్నర చెంచా
- ఆవాలు: అర చెంచా
- సెనగపప్పు: టేబుల్ స్పూను
- మినప్పప్పు: ఒక స్పూను
- పల్లీలు: పావుకప్పు
- బెల్లం తురుము: అర చెంచా
- పసుపు: కొద్దిగా
- కరివేపాకు రెబ్బలు: రెండు
- ఉప్పు: తగినంత
- నువ్వుల నూనె: తగినంత
- ఇంగువ: పావు స్పూను
- పచ్చి మిర్చి: ఒకటి
తయారు చేసే విధానం:
ముందుగా చింతపండును వేడి నీటిలో నానబెట్టుకుని ఆ తరువాత చిక్కని రసం తీసుకోవాలి. మిరియాలు, రెండు ఎండు మిరపకాయలను దోరగా వేయించి, పొడి చేసి సిద్ధంగా వుంచుకోవాలి. స్టవ్ మీద కదాయిని పెట్టి నూనె (oil) వేసి ఆవాలు, మినప్పప్పు, సెనగపప్పు, పల్లీలు, మిగిలిన ఎండుమిర్చి, కరివేపాకు, (Curry leaves) పచ్చిమిర్చి, ఇంగువ వేయించుకుని చింతపండు గుజ్జు వేయాలి. ఇది ఉడుకుతున్నప్పుడు పసుపు, తగినంత ఉప్పు, సిద్ధంగా పెట్టుకున్న మిరియాల పొడి, బెల్లం తురుము వేసి కలిపి రెండు నిమిషాలయ్యాక స్టవ్ మీది నుండి దింపేయాలి. ఈ మిశ్రమాన్ని అన్నంపైన వేసి చక్కగా కలిపితే మిరియాల పులిహోర సిద్ధం.
Read also: hindi.vaartha.com
Read also: