Pearl Millet Kheer-కావలసిన పదార్థాలు:
- సజ్జలు – 1 కప్పు
- సేమియా – ½ కప్పు
- బెల్లం – 1 కప్పు
- పాలు – 4 కప్పులు
- డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, కిస్మిస్) – ¼ కప్పు
- నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
- యాలకుల పొడి – ¼ టీస్పూన్
తయారు చేసే విధానం
సజ్జలను రెండు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించి బాగా కడిగి గంటసేపు నానబెట్టాలి. స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేడయ్యాక బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. సేమియా కూడా వేయించి పెట్టుకోవాలి. అదే కడాయిలో పాలు (milk) పోసి బాగా మరుగుతున్న దశలో నానబెట్టిన సజ్జలు (Pearl Millet) జోడించి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత సేమియా, తరిగిన బెల్లం వేసి కలుపుతూ మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. చివరిగా యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్ కలుపుకొంటే సజ్జల పాయసం రెడీ.
Read also: hindi.vaartha.com
Read also: Sweet Corn Pakoda : స్వీట్ కార్న్ పకోడి