Wheat Halwa:కావలసిన పదార్థాలు:
- గోధుమపిండి – 1 కప్పు
- పంచదార – 1 కప్పు
- నెయ్యి – తగినంత
- జీడిపప్పులు – 5
- కిస్మిస్ – 5
- ఏలకుల పొడి – 1 స్పూన్
తయారు చేసే విధానం:
స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకోవాలి. వేడెక్కేక ముందుగా నెయ్యి వేసుకుని, తరువాత గోధుమపిండిని వేసి ఉండ కట్టకుండా బాగా కలుపుతూ, ఈ మిశ్రమానికి పంచదార (sugar) చేర్చాలి. ఈ పదార్థాలు బాగా కలుపుతూ కొంచెం కొంచెంగా నీరు పొయ్యాలి. బాగా కలుపుతూ ఉంటే కొంచెం ముద్దగా వస్తుంది. నీరు ముందే ఎక్కువగా పోయకుండా కొద్దికొద్దిగా ముద్దగా, దగ్గర పడేవరకు పోసుకోవాలి. తరువాత నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్(Raisins) వేసుకొని, ఏలకుల పొడి కలుపుకోవాలి. పంచదార బదులు బెల్లంతో కూడా చేయవచ్చు.
Read also: hindi.vaartha.com
Read also:Moringa Leaves with Tapioca Flour Curryమునగాకు – తెలగపిండి కూర