కావలసిన పదార్థాలు:
- పెసలు – పావు కప్పు
- సెనగపప్పు – పావు కప్పు
- గుడ్లు – 2
- నూనె – పావు కప్పు
- వెన్న – 1 టేబుల్ స్పూను
- ఉప్పు – తగినంత
- బిర్యానీ ఆకు – 1
- వెల్లుల్లి తరుగు – 1/3 చెంచా
- అల్లం తరుగు – 1 చెంచా
- పచ్చిమిర్చి – 2 (సన్నగా కట్ చేయాలి)
- టొమాటో – 1 (చిన్న ముక్కలుగా కోయాలి)
- కారం – 1 చెంచా
- పసుపు – అర చెంచా
- జీలకర్ర పొడి – అర చెంచా
- ధనియాల పొడి – 1 చెంచా
- గరం మసాలా – అర చెంచా
- కస్తూరీ మెంతో – 1 చెంచా
తయారీ విధానం:
పప్పుల్ని మూడుగంటల ముందు నానబెట్టుకుని ఆ తరువాత సరిపడా నీళ్లు పోసి మూడు కూతలు వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
అలాగే గుడ్ల(Egg Tadka Masala Recipe) సొనను ఓ గిన్నెలో తీసుకుని చిటికెడు ఉప్పు వేసి గిలకొట్టుకుని చెంచా నూనెలో ఆమ్లెట్ మాదిరి వేసుకుని ఆ తరువాత ముక్కల్లా కోసుకోవాలి.
ఇప్పుడు స్టవ్మీద కడాయిని పెట్టి.. మిగిలిన నూనె, వెన్న వేయాలి.
ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేయించుకుని, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి.
అవి కూడా వేగాక పసుపు, తగినంత ఉప్పు, టొమాటో(Tomato) ముక్కలు, జీలకర్రపొడి, దనియాలపొడి, గరంమసాలా వేసి కలపాలి.
టొమాటో ముక్కలు మగ్గాక కాసిన్ని నీళ్లు పోసి.. ఉడికించిన పప్పు వేసి కలపాలి.
రెండు నిమిషాలయ్యాక గుడ్డు(Eggs) మిశ్రమం, కసూరీమేథీ వేసి బాగా కలిపి స్టవ్ కట్టేయాలి.(Egg Tadka Masala Recipe)
Read Also: hindi.vaartha.com
Read Also: Veg Burji : వెజ్ బుర్జీ ఎలా తయారు చేయాలో తెలుసా..