Cucumber Raita : కావలసిన పదార్థాలు:
- కీరా – ఒకటి (తొక్క, గింజలు తీసినది)
- పెరుగు – రెండు కప్పులు
- ఆవాలు – ఒక టీస్పూను
- పచ్చిమిర్చి – రెండు
- ఆవనూనె – పావు కప్పు
- కొత్తిమీర – గుప్పెడు
- కారం – ఒక టీస్పూను
- పసుపు – అర టీస్పూను
- ఉప్పు – రుచికి సరపడా
తయారు చేసే విధానం:
తొక్క, గింజలు తీసిన కీరాను సన్నగా తురిమి పక్కన పెట్టుకోవాలి. పెరుగును (curd) పెద్ద గిన్నెలో వేసి కవ్వంతో చిలకాలి. తర్వాత పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు ఆవాలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తురిమిన కీరాను (Cucumber) చిలికిన పెరుగులో వేయాలి. పసుపు, కారం కూడా వేసి చక్కగా కలపుకోవాలి. దీన్ని అరగంట పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టి తర్వాత సర్వ్ చేసుకోవాలి.
Read also: hindi.vaartha.com
Read also: