Colorful Coconut Laddu కి కావలసినవి:
- కొబ్బరి తురుము – 1 ½ కప్పు
- కండెన్సెడ్ మిల్క్ – ¼ కప్పు
- యాలకుల పొడి – ¼ టీస్పూన్
- పాలు – 2 టేబుల్ స్పూన్లు
- ఆరెంజ్ ఫుడ్ కలర్ – తగినంత
- పచ్చ ఫుడ్ కలర్ – తగినంత
తయారీ విధానం:
పావు కప్పు కొబ్బరి తురుమును పక్కన పెట్టు కోవాలి. మిగిలిన కొబ్బరి తురుము, కండెన్సెడ్ మిల్క్(milk) యాలకుల పొడిని మందపాటి గిన్నెలో వేసి వేడి చేయాలి. తక్కువ మంట మీద కలుపుతూ ఐదు నిమిషాలు ఉడికించాలి. పాలు పోసి మరికాసేపు ఉంచిన తర్వాత చల్లార్చాలి. ఈ మిశ్రమను మూడు సమాన భాగాలు చేయాలి. ఒక భాగంలో ఆరెంజ్, మరో భాగంలో పచ్చ రంగు (green color) ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి. చల్లారిన తర్వాత మూడు రంగుల లడ్డులను చుట్టు కోవాలి. ప్లేటులో మొండుగా ఆరెంజ్, తర్వాత తెలుపు, చివరగా పచ్చరంగు లడ్డూలను అమర్చాలి. మూడు రంగుల లడ్డూలు చూడ ముచ్చటగా భలే ఉంటాయి.
Read also:hindi.vaartha.com
Read also: Tricolour Idli’s Recipe:మూవ్వన్నెల ఇడ్లీలు