పదార్థాలు:
- చికెన్ – 500 గ్రా
- ఆలుగడ్డ – ఒకటి (పెద్దది)
- టమాట – ఒకటి
- పచ్చిమిర్చి – 4
- కరివేపాకు – 2 రెబ్బలు
- ఉల్లిగడ్డ – ఒకటి
- అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్
- పసుపు – ½ టీ స్పూన్
- ధనియాల పొడి, కారం – 1 టీ స్పూన్ చొప్పున
- నూనె – అరకప్పు
- పచ్చికొబ్బరి తురుము – అరకప్పు
- జీడిపప్పు – 10
- తర్బూజ గింజలు, గసగసాలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున
- కొత్తిమీర తురుము – కొద్దిగా
- నిమ్మరసం – 1 టీ స్పూన్
- గరం మసాలా – ½ టీ స్పూన్
- ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం:
ముందుగా పచ్చికొబ్బరి, జీడిపప్పు, గసగసాలు, తర్బూజ గింజలను మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా ముద్దగా చేసుకోవాలి. చికెన్‌ను (Chicken) బాగా కడిగి, ఉప్పు, నిమ్మరసం కలిపిన నీళ్లలో ఒక గంట నానబెట్టాలి.
కడాయిలో నూనె వేడయ్యాక కరివేపాకు, ఉల్లిగడ్డ (onion) పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేగాక తరిగిన టమాట ముక్కలు జోడించి మగ్గించాలి. కారం, ధనియాల పొడి, పచ్చికొబ్బరి మిశ్రమం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి.
తర్వాత తరిగిన ఆలుగడ్డ ముక్కలు, నానబెట్టిన చికెన్ వేసి మూత పెట్టి సన్నటి మంటపై అర్ధగంట ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని దించుకుంటే నోరూరించే చికెన్ ఆలూ కుర్మా రెడీ.
Read also: hindi.vaartha.com
Read also: