Vallabhaneni Vamsi: వంశీ ఆరోగ్య పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Read Time:  1 min
Vallabhaneni Vamsi: వంశీ ఆరోగ్య పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

కంకిపాడు పోలీస్ స్టేషన్‌లో ఉన్నప్పుడే తీవ్ర అస్వస్థతకు గురైన వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ఆరోగ్య పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది. శుక్రవారం అర్థరాత్రి ఊపిరితిత్తుల సమస్యలతో వాంతులు చేసుకున్న వంశీని పోలీసులు వెంటనే కంకిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. అప్పటికే ఆయనకు తీవ్ర అస్వస్థతలతో ఊపిరితిత్తుల సమస్య ఎదురైనట్టు తెలుస్తోంది. వైద్యులు కూడా పరిస్థితిని స్వల్పంగా సీరియస్‌గానే పరిగణించినట్టు సమాచారం. ఆసుపత్రిలో రాత్రంతా వంశీకి చికిత్స కొనసాగింది. చికిత్స అనంతరం మళ్లీ ఆయనను కంకిపాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

నకిలీ ఇళ్లపట్టాల కేసు నేపథ్యం:

నకిలీ ఇళ్లపట్టాల కేసులో వంశీని రెండు రోజుల పోలీసు కస్టడీకి ఇచ్చింది నూజివీడు కోర్టు. ఇవాళ్టితో వల్లభనేని వంశీ పోలీసు కస్టడీ ముగియనుంది. ఈ క్రమంలో నిన్న రాత్రి కంకిపాడు పోలీసు స్టేషన్‌లో ఉండగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి వంశీని తీసుకెళ్లారన్న సమాచారంతో అక్కడకు చేరుకున్నారు వంశీ సతీమణి పంకజశ్రీ, మాజీ మంత్రి పేర్ని నాని అనంతరం వంశీని పరామర్శించారు.

పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు:

ఈ సందర్భంగా పేర్ని నాని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడుతూ, పరిస్థితి సీరియస్ గా ఉంటే విజయవాడ ఆసుపత్రికి రిఫర్ చేస్తామని వైద్యులు చెబుతున్నారన్నారు. పోలీస్టేషన్ లోనే వంశీ వాంతులు చేసుకున్నారన్నారు. ప్రభుత్వాన్ని నడిపేవారికి విజ్ఞప్తి చేస్తున్నాం కక్ష ఉంటే ఏడాది జైల్లో వేసుకోండి కానీ మనిషిని చంపి పైశాచికానందం పొందాలనుకోవడం సరికాదంటూ పేర్కొన్నారు. వంశీ మీద ఒకదాని వెంట ఒకటి తప్పుడు కేసులు పెడుతున్నారు. అస్వస్థతకు గురైతే ఆసుపత్రికి తీసుకెళ్లి బాగోకపోయినా ఆరోగ్యం బాగుందని రాసి పంపిస్తున్నారంటూ నాని ఆరోపించారు. అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో వంశీ తప్పుచేశారని చెబుతన్నారని తప్పుడు కేసులతో విచారణ చేస్తే ప్రజలు హర్షించరన్నారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలను కొట్టడం నడవడం లేకుండా చేస్తున్నారని ఎవడ్ని కొట్టమంటే వాడిని కొట్టే స్థితికి పోలీసులను తెచ్చారని పేర్ని నాని ఆరోపించారు. పోలీసులు అధికార పరంగా దుర్వినియోగం చేస్తున్నారని నాని పేర్కొన్నారు. వల్లభనేని వంశీ ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలని, రాజకీయంగా విభేదాలు ఉన్నా మానవతా విలువలు ప్రదాన్యం ఇవ్వాలని పలువురు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. కేసుల విచారణ ఒక వేరు, వ్యక్తిగత ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం సరిగ్గా కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Read also: Jagan: తారాస్థాయికి చేరిన జగన్,సాయిరెడ్డిల మాటల యుద్ధం

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.