జవాబు: ఇల్లు ఊడవటం సాధారణమయిన రోజువారీ పనులలో ఒకటి. ఒక గదిని చీపురు పట్టి తుడవటం, ఆ చెత్తను ఒక మూలకు పోగు చేసి కొంతసేపు అలా వుంచి తర్వాత తీరిగ్గా ఎత్తి బటయకు పారవేస్తుంటారు. ఇల్లు ఊడ్చేటప్పుడు ఆ చెత్తను ఈశాన్య మూలకు పోగు చేయకూడదు. ఈశాన్య మూల నుండి ఊడవటం ప్రారంభించి చెత్తను నైరుతి మూలకు పోగు చేసేలా గదిని చీపురుతో తుడవాలి. పోగయిన చెత్తను అలాగే వుండనీయకుండా వెంటనే ఎత్తి బుట్టలో వేయటమో లేదా బయటకుండీలో పారవేయటమో చేయాలి. చెత్తడబ్బాను నైరుతి మూలలో ఏర్పాటు చేసుకోవాలి.
ఇల్లు తుడిచిన తర్వాత చీపురును ఈశాన్య మూలల్లో పెట్టకూడదు. నైరుతి మూల చీపురు ‘హాండిల్’ పైకి వచ్చేలా తుడిచే భాగాన్ని కిందకు వచ్చేలా నేల మీద పెట్టాలి.
చీపురు శని ఆయుధం
చీపురు ‘శని’ ఆయుధం. ఆయన చేతిలో చీపురు పైకి ఎత్తి పట్టుకుని ఉంటుంది. ఇంట్లో అలాగే (హాండికి కిందకు వచ్చేలా) పెట్టిన చీపురు ఆయన ఉనికికి చిహ్నం. కనుక అలా పెట్టి కష్టాలు కొనితెచ్చుకోవద్దు.
ఈశాన్యంలో పూజ?
ప్రశ్న: పూజ ఈశాన్యంలో ఎలా చేయాలి?
జవాబు: ఈశాన్య మూలలో భగవంతుణ్ణి పూజించటం శ్రేష్ఠం అనేది వాస్తవం. అయినా కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటించక తప్పదు. ఈశాన్యంలో మూలకు దేవుని (God) గృహం కట్టడం, ఈశాన్యంలో తూర్పు, త్తురాలు కలిసే మూలకు అరుగుల నిర్మాణం గావించి ఆ అరుగుల పైన (మెట్ల పైన) దేవుని పటాలు పెట్టి పూజించటం సరైన పద్ధతి కాదు. కోరి కష్టాలు తెచ్చుకోవాలంటే అలాంటి పనులు చేయవచ్చు. ఈశాన్య మూల చాలా సున్నితమయిందని, ఎటువంటి ఎత్తును గానీబరువును గానీ సహించదు. ఈశాన్య మూలలో ఒక చదరపు అడుగు నేలను అంటకుండా వదిలేయటం శ్రేష్ఠం. తూర్పు గోడకు నేల నుండి కనీసం ఒక అడుగుపైన, ఈశాన్య మూల నుండి ఒక అడుగు తర్వాత గోడలోనే గూడు (షెల్ఫ్)ను కట్టి అందులో భగవంతుని పటాలు పెట్టి తూర్పుకు అభిముఖంగా కూర్చుని పూజ (Pooja) చేయటం వల్ల చాలా మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఒకవేళ మందిరంలో బరువయిన విగ్రహాలు పెట్టాల్సి వస్తే వాయువ్య మూలలో మందిర నిర్మాణం చేసుకొని పశ్చిమాభిముఖంగా పూజలు చేయడం మంచిది. విగ్రహాలు అప్పడు తూర్పు అభిముఖంగా ఉంటాయి.
ఆగ్నేయ మూలలో వంట?
ప్రశ్న: వంట ఆగ్నేయంలోనే చేయాలా?
జవాబు: వంట ఆగ్నేయంలో చేయాలనేది వాస్తు నియమం. అయితే పొయ్యిని పూర్తిగా ఆగ్నేయ మూలలో తూర్పు, దక్షిణ గోడలకు ఆనించి వంట చేయడం సరయిన ఫలితాలు నివ్వదు. పొయ్యి ఆగ్నేయ మూలన తూర్పు గోడకు తగలకుండా వుండాలి. దక్షిణ గోడను ఆనుకొని వున్నా పరవాలేదు. లేదా తూర్పు దక్షిణ గోడలకు ఆనుకొని లేకున్నా పరవాలేదు. ఆగ్నేయ మూల ఒక చదరపు అడుగు స్థలాన్ని ఖాళీగా వదిలేసి తూర్పు గోడను ఆనకుండా పొయ్యి (స్టవ్) అమర్చి తూర్పుకు అభిముఖంగా నిలబడిగానీ, కూర్చునిగానీ వంట చేయాలి. తూర్పు గోడలకి గూడులా కట్టి ఆ గూటిలో స్టవ్ పెట్టి వంట చేయటం కూడా సరైన పద్ధతి కాదు.
ఈశాన్యంలో నీళ్లు ఉండవచ్చా? లేదా?
ప్రశ్న: ఈశాన్యంలో నీళ్లు ఉంటే ఎలాంటి ఫలితాలుంటాయి?
జవాబు: ఈశాన్యంలో నీళ్లు ఉండాలి అని చాలా మంది అక్కడ నీళ్లు పట్టి పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ బోర్వెల్ గానీ, పంపుగానీ, బావిగానీ లేకపోతే అవి ఏర్పాటు చేసుకొనే అవకాశం కూడా లేకపోతే డ్రమ్ముల్లో నీళ్లు నింపి అక్కడ పెడుతుంటారు. అది మంచి ఫలితాలనివ్వదు సరికాదా తద్వారా చెడు ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి. ఈశాన్య మూల భూమి లెవెలుకంటే తక్కువ లెవెల్లో నీటిని పట్టి వుంచాలి. అంటే సంప్ లాంటిది కట్టి నీళ్లని స్టోర్ చేయాలి. కానీ భూమి పైన డ్రమ్ముల్లో నీళ్లను పట్టి ఆ మూల భారం అధికం చేయటం వాస్తు నియమాలకు విరుద్ధం.
Read also: hindi.vaartha.com
Read also: