📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

vastu for well: బావి తవ్వటానికి ఏ ప్రదేశాలు శ్రేయస్కరం?

Author Icon By Hema
Updated: August 1, 2025 • 5:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

vastu for well:బావి తవ్వటానికి ఉత్తర ఈశాన్యపు చోటునుగానీ, తూర్పు ఈశాన్యపు చోటును నిర్ణయించుకోవాలి. ఇంటి ఈశాన్య మూల నుండి ప్రహరీగోడ ఈశాన్య మూలకు ఒక తాడు కొంచెం గట్టిగా లాగితే ప్రహరీ గోడ ఈశాన్య మూల రెండు ఈశాన్య మూలలుగా విభజింపబడుతుంది.

ఒకవైపు ఉత్తర ఈశాన్యం, మరోవైపు తూర్పు ఈశాన్యం. ఎక్కువ స్థలం (place) ఎటు వైపు వుంటే అటువైపు అనుకూలంగా బావి
తవ్వుకోవచ్చు. తాడు చూపిస్తున్న డైరెక్షన్మధ్యలో బావి తవ్వకూడదు.

భవిష్యత్తులో ఇంటిమార్పులను కూడా దృష్టిలో ఉంచుకుని బావి (well) తవ్వే స్థలాన్ని నిర్ధారణ చేసుకుంటే మంచిది. బావి భూమి లోపలికి గుండ్రంగా వరలు దింపవచ్చు. బావి పైన గట్టు
చతురస్రంగా కాక గుండ్రంగానే నిర్మించాలి.

చతురస్రంగా నిర్మిస్తే

బావి పైభాగం చతురస్రంగా నిర్మిస్తే ఏదో ఒక కోణం ఇంటికి పోటును కలిగిస్తుంది. అందువల్ల ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుంది. బావిచుట్టూ నిర్మించే ప్లాట్ఫారం ప్రహరీ తూర్పు, ఉత్తర గోడలను తాకకుండా కొంత స్థలాన్ని వదిలేసి కట్టాలి. బావి
ప్లాట్ఫారమ్ ఇంటి నేల లెవెలు కన్నా తక్కువ లెవెలులో ఉండాలి. ప్లాట్ఫారమ్ నుండి నీరు ఈశాన్యం వైపు ప్రవహించి బయటకు వెళ్లేలా పల్లాన్ని ఏర్పాటు చేయాలి. లేదా ఈశాన్యంలో
ఉన్న అవుట్లెట్ ద్వారా భూమిలోపల ఏర్పాటు చేసిన పైపులో పడి అటు నుండి అంతర్గతంగా వెళ్లే ఏర్పాటుచేయాలి.


బోరింగ్కు కూడా ఇదే పద్దతి వర్తిస్తుంది. కొంత మంది ఇంటికి ఈశాన్య మూల అని బావినిగానీ, బోరింగునుగానీ ఇంటి ఈశాన్య మూలకు ఆనుకొని నిర్మిస్తారు.

ఇది సరైన పద్ధతి కాదు. బోరుగానీ,
బావినిగానీ ఇంటికి ఈశాన్య మూలలో కాక పూర్తి ఇంటి స్థలానికి ఈశాన్యంలో బయట రావాలి, ఇంటి కప్పుకింద బావి తవ్వకూడదు.ఫలితాలు తూర్పు ఈశాన్య స్థలంలో బావివుంటే యజమానికి పేరు ప్రతిష్ఠలతో పాటు సకల సంపదలు కలుగుతాయి.

ఉత్తర ఈశాన్యంలో బావి వుంటే

అది యజమాని పేరు ప్రతిష్ఠలకు పూచీపడదు, కానీ ఐశ్వర్య వృద్ధిని, సంతాన వృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని కలిగిస్తుంది. తూర్పు ఈశాన్యంలో కాక తూర్పున మధ్య నుండి ఈశాన్యం వైపు స్థలంలో
బావి వుంటే యజమానికి, కుటుంబానికి ఎన్నో శుభాలు చేకూరుతాయి.

ఉత్తర ఈశాన్యంలో కాక మధ్య ఉత్తరం నుండి ఈశాన్యపు మూలకు దగ్గర స్థలంలో బావి ఎక్కడున్నా యజమానికి, కుటుంబానికి కూడా మంగళప్రదమవుతుంది. బావులు తవ్వకూడని ప్రదేశాలు బావులు తవ్వకూడని స్థలాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బావులు తవ్వకూడదు.
ఉత్తర వాయువ్య స్థలంలో బావి తవ్వించినా, లేక గోతులు వున్నా శత్రువుల బాధలు కలుగుతాయి. స్త్రీలకు మానసిక సుఖశాంతులు కరువవుతాయి.

వాటి ప్రభావం యజమాని మీద పడి దుష్ఫలితాలు కలుగుతాయి. దక్షిణ నైరుతి భాగంలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే ఆర్థిక నష్టాలు,
రుణభారం కలుగుతాయి. ఆ ఇంట్లోఉంటే స్త్రీలకు ఆరోగ్య సమస్యలుంటాయి.
దక్షిణ ఆగ్నేయంలో బావులు, గోతులు వుంటే యజమాని చెడు అలవాట్లకు లోనవుతారు. ధన నష్టం, అగ్నిభయం, అనారోగ్యం కలుగుతాయి.

తూర్పు ఆగ్నేయంలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే సంతానానికి, యజమానికి ఆరోగ్యం చెడిపోవడం, దొంగల భయం, అగ్నిభయం మొదలయిన నష్టాలు కలుగుతాయి.
పశ్చిమ నైరుతిలో బావిగానీ, గొయ్యిగానీ వుంటే పురుషులు చెడు ప్రవర్తనకు లోనవటమే గాక, వ్యాధుల బారిన పడతారు.

దక్షిణాన బావి తవ్వటం వల్ల స్త్రీలకు సమస్యలు వస్తాయి. పశ్చిమ భాగంలో బావి తవ్వితే పురుషులకు అనారోగ్యం, అష్టకష్టాలు వస్తాయి.

కనుక బావి తవ్వాలనుకున్నప్పుడు ఎవరో చెబితే విన్నదిగానీ, పుస్తకాల్లో చదివిన విషయాలు గానీ దృష్టిలో పెట్టుకొని స్వంత నిర్ణయాలు తీసుకోకుండా ‘వాస్తు’ గురించి బాగా తెలిసిన వారిని సంప్రదించి
వారి సలహా మేరకు స్థల నిర్ణయం చేసుకోవటం శ్రేయస్కరం.

Read also: hindi.vaartha.com

Read also:Demonic traps :పిశాచ స్థలాలు అంటే

house well construction northeast corner vastu for well vastu tips vastu water source

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.