📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

vastu for place:అమ్మకూడని స్థలాలను తెలుసుకోవడం ఎలా?

Author Icon By Hema
Updated: August 11, 2025 • 3:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఏదైనా ఒక క్షేత్రం (స్థలం)గానీ,గృహం గానీ కొన్న తరువాత (లేదా) కిరాయికుగానీ లీజుకుగానీ తీసుకున్న తదుపరి మూడున్నర నెలల వ్యవధిలో ఏదైనా చాలా మంచి ఫలితం అనుభవంలోకి
వచ్చినట్లయితే అలాంటి స్థలాలను, గృహాలను వదలకూడదు.

చాలా మంచి ఫలితాలు అంటే-

1) దీర్ఘకాలంగా పీడిస్తున్న ఏదైనా ఒక సమస్య పరిష్కారమవటం. 2) ఒక పెద్ద అప్పు తీరటం. 3)అనారోగ్యసమస్యలకు ఊరట లభించటం. 4)సంతానం లేనివారికి సంతానంకలుగుట. 5) ఆస్తి (Property) కలిసిరావడం. 6)వివాహం(marriage) కానివారికి వివాహంజరగటం. 7) దూరమైన బంధువులు దగ్గరవటం. 8) పదోన్నతి లభించటం..మొదలైనవి మూడున్నర రోజుల్లోగానీ,మూడున్నర నెలల్లోగానీ ఇటువంటి సత్ఫలితాలను గృహాలు, స్థలాలు మంచిఫలితాలను యిస్తూనే
ఉంటాయి. అందువల్ల ఇటువంటి గృహాలను, స్థలాలను విడిచిపెట్టకూడదు. అమ్మకూడదు.

ఏది నిజం?

ప్రశ్న: వచ్చే కార్తిక మాసంలో నేను గృహ నిర్మాణం చేయాలని అనుకుంటున్నాను. ఆ ఇంటి ప్లాను మీకు పంపిస్తున్నాను. చేయాల్సిన మార్పులు సూచించగలరు. గృహానికి నైరుతి మూలలో టాయిలెట్స్ పెట్టకూడదని కొందరు, పర్వాలేదు పెట్టవచ్చు అని కొందరు అంటున్నారు?
ఇందులో ఏది నిజం? పెట్టవచ్చా? పెట్టకూడదా? తెలుపగలరు.
జవాబు: ఏ గృహానికైనా సరే కట్టుబడి స్థలానికి నైరుతి మూలన టాయిలెట్స్, బాత్రూమ్స్ నిర్మించకూడదు. మీ గృహం ప్లాను ప్రకారం పూర్తి మార్పులను స్థలాభావంచేత ఈ శీర్షికలో
వివరించటానికి వీలుగాదు. వ్యక్తిగతంగా సంప్రదించి సలహాలు, సూచనలుపొందవచ్చు.

రెండు సెప్టిక్ ట్యాంకులు?

ప్రశ్న: ఒక ఇంట్లో రెండు సెప్టిక్ ట్యాంక్లు ఉండవచ్చా? దక్షిణ ఆగ్నేయంలో మరుగుదొడ్డి కట్టి
ఉన్నది. వాయువ్య దిశలో ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ట్యాంక్ ఉన్నది. ఈ విధంగా ఒకే ఇంట్లోరెండు సెప్టిక్ ట్యాంక్లు ఉండవచ్చా?
జవాబు: ఒకే గృహంలో రెండు సెప్టిక్ ట్యాంకులు ఉండకూడదు. మీరు నిర్మించిన రెండు సెప్టిక్ ట్యాంకులు కూడా వాస్తు ప్రకారం సరైన స్థానాలలో లేవు. స్థలానికి తూర్పు లేదా ఉత్తర మధ్య భాగానికి కాస్త అటు ఇటుగా సెప్టిక్ ట్యాంక్ ఉండవచ్చు. ప్రధాన ద్వారానికి గేటు ఎదురుగా రాకుండా నడకలోకి రాకుండా ఉండే స్థానంలో సెప్టిక్ ట్యాంక్ను నిర్మించుకోవలసి
ఉంటుంది.

నైరుతి గది ఆఫీసుకు
కలిసొస్తుందా?

ప్రశ్న: ఈ ప్లాన్ ప్రకారం ఇంటి దక్షిణం వైపు ద్వారం ఉండటం వలన మా ఇంటికి వీధి పోటు (దక్షిణ) ఏమైనా ఉందా? దక్షిణ లేదా నైరుతి గదిని ఆఫీసు కోసం వాడవచ్చా?
జవాబు: మీ ఇంటికి దక్షిణ/దక్షణ నైరుతి వీధిపోటు ఉన్నది. ఈ విధమైన వీధిపోటు మంచిది కాదు. అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా ఆందోళన కలిగించే సంఘటనలు జరుగుతూ ఉండే
అవకాశముంటుంది. ప్రత్యామ్నాయపద్ధతులు పాటించవలసిన అవసరం ఉంది. వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. మీరు పేర్కొన్న ఆ గదిని ఆఫీసు గదిగా ఉపయోగించకపోవటమే మేలు.

Read also:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/vastu-for-work/vaastu/526887/

house construction septic tank rules toilet placement vastu shastra vastu tips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.