ప్రశ్న: ఇల్లు కట్టించాను.నెల నెలా అప్పు పెరిగిపోతున్నది. అప్పుల బాధలు పడలేక ఇల్లు అమ్మకానికి పెట్టాను. కానీ సరైన బేరం రావడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
ఏం చేస్తే నా పరిస్థితిలో మార్పువస్తుంది?
ఇంటి వరండాగా వాడుతున్న నైరుతి స్థలంలో ఇంటికి(home) తగలకుండా పశ్చిమ, దక్షిణ గోడలను ఆనుకుని బాత్రూమ్ నిర్మించండి. ప్రస్తుతం పశ్చిమ వాయవ్యంలో యింటికి ఆనుకొని కట్టుకున్న బాత్రూమ్ని పూర్తిగా తొలగించి అక్కడ ఇంట్లోకి ప్రవేశించే ప్రధాన ద్వారం తెరవండి. ఆ ప్రవేశ ద్వారానికి ఎదురుగా ద్వారాలు తెరచి నడక తూర్పు ఈశాన్యం నుండి పశ్చిమ వాయవ్యంవైపు సాగేలా చూడం డి. నీచ స్థానంలో వున్న ఆర్థిక,(financial) ఆరోగ్య పరిస్థితులు తప్పక మెరుగవుతాయి.
అప్పులు తీరే మార్గం?
ప్రశ్న: ఎప్పుడూ ఏదో ఒక సమస్య. ఎంత వచ్చినా అంతకు రెట్టింపు ఖర్చులు వచ్చి పడుతున్నాయి. దాంతో అప్పులు చేయక తప్పటం లేదు. నా సమస్యలకు మార్గం చెప్పగలరు.
జవాబు: అంత పెద్ద భవనంలో మీరున్న గది వాయవ్య పోర్షనుగా గుర్తింపబడుతోంది. ఆ గదికి వున్న మూడు తలుపుల్లో రెండు నీచ స్థానంలో ఉన్నాయి. ఉచ్చస్థానంలోని ఒక్క గది
ఎప్పుడూ మూసివేయండి. భవనంలోనిమిగతా పోర్షను నుండి మీ గది వేరవుతోంది. గదికి
పశ్చిమ నైరుతికి వున్న తలుపు ద్వారానే మీ నడక జరగటం వల్ల మీకు చెడు ఫలితాలు
ఎదురవడంలో ఆశ్చర్యం లేదు. ఆ ఒక్క తలుపును పశ్చిమ వాయవ్యానికి మార్చుకోగలిగితే మీకు తప్పకుండా మంచి ఫలితాలు కలుగుతాయి.
ఈ ఇంట్లో ఉండవచ్చా?
ప్రశ్న: నాన్నగారి అన్నదమ్ములు వాటాలు పంచుకోగా ఈ గృహం వచ్చింది. మా అన్నదమ్ములకు ఎవ్వరికీ సెటిల్మెంట్స్ లేవు. పొత్తు కుదరటం లేదు. నేను పెద్దవాడిని. ఈ ఇంట్లో మేం ఉండవచ్చా? ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు.
జవాబు: మీ గృహానికీ, షాపులకీ మధ్యన ఒకదాని మూలపోటు మరొకదానికి తగులుతుండటం వలన
మీరిప్పటికే అనేక నష్టాలు ఎదుర్కొన్నారు. మూలపోటు దోషాన్ని వెంటనే సవరించడం మంచిది. మీరు ప్రస్తుతం ఈశాన్య భాగంలో వుంటున్నారు. ఆ గృహంలో మీరు నైరుతి భాగంలో వుండటం మంచిది.
పనులు జరగటం లేదు
ప్రశ్న: మేం రెండు ఇండ్లకు పునాదులువేసాం. ఒక ఇల్లు కట్టించాం. అంటే పడమటిది. రెండవది పునాదులు వేసి వదిలేసాం. పక్కన వున్న వంకర స్థలాన్ని వదిలేసాం. దానివల్ల మాకు నష్టం
కలుగుతుందా? మేం ఇల్లు కట్టినప్పటి నుండి ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాం. అనుకున్న పనులు జరగటం లేదు. ఈశాన్యంలో నుయ్యి తవ్వించాం.
జవాబు: రెండు పోర్షన్లకు కూడాఆగ్నేయ మూలలో మీరు బాత్ రూమ్, లెట్రిన్లు కట్టించారు. తూర్పువైపున వున్న పోర్షన్కి తూర్పు-ఆగ్నేయాన్ని ఆనుకొనివున్న లెట్రిన్ని నిర్మూలించి అదే
లెట్రినిని ఆ పోర్షన్ నైరుతిమూల దక్షిణ, పశ్చిమ కాంపౌండు గోడలను ఆనుకొని బాత్ రూమ్ని కట్టించండి. ఇదే విధమైన తూర్పు, పశ్చిమ పోర్షన్కి కూడా చేయడం వలన మంచి మార్పులు
కనిపిస్తాయి.
లెట్రిన్ ద్వారం ఎటువైపు?
ప్రశ్న: లెట్రిన్ ద్వారం మూసివేయాలని అనుకుంటున్నాం. ఒకవేళ మూసివేస్తే ద్వారం ఎటువైపు పెట్టుకోవాలి? తెలుపగలరు.
జవాబు: తలుపు సంగతి తరువాత.. మీరు లెట్రిన్ని ఇంటిలోపలి ఉత్తర గోడకు ఆనుకుని కట్టారు. అలా కట్టకూడదు. పశ్చిమం లేదా దక్షిణ మధ్యమంలో రెండు గదుల మధ్య హాల్లోకి తెరుచుకునేలా లేదా ఏదయినా బెడ్ రూమ్కి ఎటాచ్డ్ బాత్ రూమ్లో కట్టాలి.
నైరుతి కలిసొస్తుందా?
ప్రశ్న: కార్పెంటెర్గా పని చేస్తున్నాను. పేరు, సంపాదన బాగున్నాయి. కానీ ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. దక్షిణం సరిహద్దు చేర్చి నిట్రాళ్లు పాతి దక్షిణంవైపు పదిన్నర
అడుగుల ఎత్తు, ఉత్తరంవైపు ఏడున్నర అడుగులు ఎత్తు వచ్చేలా మొత్తం తారురేకులు వేసాను. ప్రస్తుతం నైరుతి పడమరలో పని చేస్తున్నాను.
జవాబు: ఈ ఇల్లు తూర్పు సరిహద్దును ఆనుకొని కట్టబడి వుంది. అదొక్కటే దోషం. తూర్పు వైపున
ఖాళీస్థలం వచ్చేలా ఇంటిని సవరించి ఉచ్చస్థానం నడకకి ఏర్పాటు చేస్తే ఈ ఇంట్లో చాలా మంచి ఫలితాలు వుంటాయి. దక్షిణ ఆగ్నేయంలో ఉచ్చస్థానం వీధిపోటు వుండటం ఈ ఇంటికి సర్వత్రా శుభదాయకం. వాస్తు ప్రకారం చిన్న మార్పులు చేసినా శుభ ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
Read also:hindi.vaartha.com
Read also: