📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vastu for Home : కుట్టుక వేధ అంటే ఏమిటి?

Author Icon By venkatesh
Updated: July 16, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vastu for Home : కుట్టుక వేధ అంటే ఏమిటి?కుట్టక వేధ అని దేనినంటారు? సవివరంగా తెలియచేయగలరు.

‘కుట్టక వేధ’ గురించి తెలుసుకొనే ముందు ‘భూ గృహం’ గురించి తెలుసుకోవాలి. భూమి అడుగు భాగంలో పైకి కనిపించకుండా నిర్మించే గృహాలను ‘భూ గృహాలు’ అంటారు. భూమి ఉపరితలానికి కొన్ని అడుగులు కిందికి, కొన్ని అడుగులు పైకి కనిపించే నిర్మించే గృహాలను ‘Cellars ‘ అంటారు. సాధారణంగా సెల్లార్స్ ని వాహనాలు నిలపకోవడానికి వాడుతుంటారు. ‘భూ మట్టం కంటే గృహం నేలమట్టం పైకి ఉండటం’ వాస్తు నిమయం. అలాగాక ‘భూమట్టం కంటే గృహంలోని నేలమట్టం కిందికి ఉండటం వలన వాస్తు దోషం ఏర్పడుతుంది. ఆ గృహానికి ఉన్న ముఖద్వార, నైసర్గిక స్వరూప, స్థల స్వభావం మొదలైన . సమీకరణాల వలన ఫలసాంద్రత హెచ్చుతగ్గులుగా ఉంటుంది.

కుట్టకే భూతదోషఃస్వాత’ అని శాస్త్ర వచనం. అంటే ‘కుట్టకవేధ’ దోషమున్న గృహం, ఆ గృహ యజమానికి, ఆ గృహంలో నివసించే వారికి ప్రతికూల ఆవేశం, భాధలను పీడలను తీరుకొక విధంగా అనారోగ్య బాధలను కలుగచేస్తుంది. యక్ష, రాక్షస, వినాయక, భూత, ప్రేత, పిశాచ, బ్రహ్మ రాక్షసాది భూతాల ఆవేశంచేత అక్కడ నివసించేవారు ఇలాంటి బాధలను, పీడలను, అనారోగ్యాన్ని పొందుతారన్న భావం. కష్టం ఏదైనప్పటికీ కారణమొక్కటే.

‘కుట్టకవేధ’ ఇలాంటి వేధలను సాంకేతిక పరంగా సరిచేసుకోవటానికి చాలా సందర్భాలలో వీలుకాదు. వీలైతే సరిచేసుకొని మంచి ఫలితాలను పొందవచ్చు.

ఇంటి లోపల నేల మట్టం తగ్గటానికున్న అనేక కారణాలలో సాధారణ కారణం ఒకటుంది! ఇంటి ముందున్న రోడ్డు లెవలు కాలక్రమంలో పెరగటం వలన ఇంటి లోపల నేల లెవల్, రోడ్డు లెవల్ కంటే తగ్గుతుంది. సాధారణంగా ‘కుట్టక వేధ’ దోషం ఇలా కూడా మొదలవుతుంది. అందువల్ల గృహ నిర్మాణ సమయంలోనే గృహం లోపల వీలైనంతగా నేలమట్టం పెంచుకొని, భవిష్యత్లో అవసరమైతే ఆవరణలో ‘ఫిల్లింగ్’ చేయగలిగే వీలుంచుకోవాలి.

Vastu for Home : ఇంటిని పడగొట్టి కొత్తగా నిర్మించాలనుకుంటున్నాం. మేం ఇద్దరం అన్నదమ్ములం. మా తమ్ముని పేరు. నరసింహారావు. నా పేరు మీదగానీ, మా తమ్ముడి పేరు మీద పడమటి ముఖద్వారం ఉండవచ్చా? నైరుతిలో ఇప్పుడు వేపచెట్టు ఉన్నది. ఆ చెట్టుకు పూజలు చేయడం లేదు. ఇల్లు కొత్తగా నిర్మిస్తే నైరుతిలో టాయిలెట్స్ కట్టవచ్చా? తెలియచేయగలరు.

వేపచెట్టును తీసివేయకూడదు. ఇంటి కట్టుబడి స్థలంలో నైరుతి మూలలో టాయిలెట్స్ కట్టకూడదు. ఇంత కాలం మనకు ఆశ్రయం ఇచ్చిన పాత ఇంటిని కూలగొట్టేముందు చేయవలసిన సాధారణ శాంతి ప్రక్రియలు ఉంటాయి. వాటిని ఆచరించాల్సిందే! అలా కాకుండా యాంత్రికంగా కూల్చేయటం వలన నూతన గృహ నిర్మాణానికి అనేక విధాలుగా అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఆ చిన్న శాంతి ప్రక్రియలు చేసుకోవటం వలన నూతన గృహం నిర్మాణం సజావుగా సాగుతుంది. ఫలితాలు కూడా బాగుంటాయి.

వాస్తుదోషాలున్నాయా?

విశాఖపట్నంలో మూడవ అంతస్తు కార్నర్ ఫ్లాట్లో మా నివాసం. అది మా స్వంత ఫ్లాట్. ఫ్లాట్ ప్లాను పంపిస్తున్నాను. ఈ ఫ్లాట్ ప్లానులో వాస్తురీత్యా ఏమైనా దోషాలు వున్నాయా?

పశ్చిమ వాయువ్యం ప్రధాన ద్వారం బాగుంది. కానీ ఈశాన్య మూలలో బెడ్ రూమ్ చిన్న పిల్లలకు, పెద్దవాళ్లకే పనికొస్తుంది. కొత్తగా పెళ్లయిన వాళ్లకు, యువకులకు పనికి రాదు. కొత్తగా పెళ్లయిన జంటకు ఈశాన్య గదిని పడక గదిగా కేటాయిస్తే తీవ్రమైన అపార్థాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉత్తరాన టాయిలెట్స్ పనికిరావు, వాస్తు యోగ్యమైనవి కావు. వాస్తు నిపుణులను సంప్రదించి అవసరమైన మార్పులు చేసుకోవడం మంచిది.(Vastu for Home)

home vastu vastu dosha vastu for home Vastu for House

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.