📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Vastu for Home Entrance : ద్వారాలు- ఫలితాలు

Author Icon By venkatesh
Updated: July 16, 2025 • 4:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

vastu for home entrance : ఇంటి ద్వారం వుంచవలసి వస్తే దాన్ని ఆ ఇంటి దక్షిణ, పడమరల వైపు అమర్చకూడదు. తూర్పుకుగానీ, ఉత్తరానికిగానీ అమర్చుకోవాలి. ఒకవేళ ఒకే ద్వారాన్ని అమర్చటానికి ద్వారాన్ని వీలు వుంటే ఆ దక్షిణం, పడమరవైపు గానీ అమర్చటం కంటే గత్యంతరం లేకపోతే అలాంటి నిర్మాణాలను చేయకపోవటం అటువంటి గదుల్లో వుండకపోవటం ఉత్తమం. తూర్పు లేదా ఉత్తర సింహ ద్వారం (ఉండేది ఒకే ద్వారమయినప్పుడు అదే సింహద్వారం అవుతుంది) గల ఇళ్లకు లేదా నైరుతి కప్పు గదికిగానీ ఈశాన్య గదికిగానీ ఈ ఒకే ద్వారం వుండే అవకాశం ఉంటుంది.

vastu for home entrance : ఇంటికి రెండు ద్వారాలు మాత్రమే అమర్చుకోవలసి వస్తే ఏదో ఒక ద్వారం తూర్పుకుగానీ, ఉత్తరానగానీ తప్పక అమర్చాలి. రెండు ద్వారాలు ఒకటి తూర్పుకు మరొకటి ఉత్తరానికి అమర్చుకోవటం సర్వదా శ్రేష్ఠం (Excellence). అలా వీలు కానప్పుడు ఒక ద్వారం తూర్పున మరొకటి దక్షిణం, పడమరలలో ఒక దగ్గర అమర్చాలి. రెండు ద్వారాలు పడమరలో ఒకటి దక్షిణంలో ఒకటి నిర్మించకూడదు. ఒక ద్వారం ఉత్తరంలో అమర్చి-మరొకటి దక్షిణం వైపుగానీ, పడమరవైపుగానీ అమర్చుకోవచ్చు. ఒక ద్వారం ఉత్తర, తూర్పు భాగాల్లో తప్పక అమర్చి, మిగతా ఒక ద్వారం పశ్చిమ, దక్షిణాల్లో అమర్చుకోవచ్చు. రెండు ద్వారాలు తూర్పు, ఉత్తరాల్లో అమర్చుకోవటం శ్రేష్ఠమని గుర్తుంచుకోవాలి.

మూడు ద్వారాలు ఇంటికి ఒకేవైపు అమర్చవలసి వస్తే–
ఒకటవ ద్వారం ‘దక్షిణ ఆగ్నేయం’లో అమరుతుంది. ఈ వైపు నడిచి వీధిలోకి వెళ్లటం శుభ పరిణామాలనిస్తుంది.. ఉత్తమం. రెండవ ద్వారం మధ్య’లో అమరుతుంది. ఇది మధ్యమం. ఇటు వైపు నడక మంచిదే. మూడవ ద్వారం ‘దక్షిణ నైరుతి’ వైపు అమరుతుంది. ఈ నడక నీచం. ఆ ఇంట్లో నివాసముండే స్త్రీల పైన చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ ద్వారం అమర్చకపోవడం మంచిది.

పశ్చిమంలో మూడు ద్వారాలు అమర్చవలసి వస్తే-
ఒకటవ ద్వారం ‘పశ్చిమ నైరుతి’లో అమరుతుంది. ఇది నీచము. గృహ యజమాని, మొదటి కుమారుని పైన ఈ నడక చెడు ప్రభావం చూపిస్తుంది. ఈ ద్వారం అమర్చకపోవటం మంచిది. రెండవ ద్వారం ‘మధ్యమం’. ఈ నడక మంచిదే. మూడవ ద్వారం ‘పశ్చిమ వాయువ్యం’లో అమరుతుంది. ఈ నడక మంచిది, శుభప్రదమయింది.

ఒకవేళ ఉత్తరంలో మూడు ద్వారాలు అమర్చవలసి వస్తే-
ఒకటవ ద్వారం ‘ఉత్తర వాయువ్యం’లోకి వస్తుంది. ఈ నడక మంచిది కాదు. ఈ ద్వారం వల్ల ఇంట్లో మూడవ సంతతి చెడు ప్రభావానికి లోనవటం జరుగుతుంది. మూడవ సంతతి అబ్బాయి అయినా, అమ్మాయి అయినా కీడు జరిగే ప్రమాదం ఉంటుంది. కనుక ఆ ద్వారాన్ని అమర్చకపోవటం మంచిది. అది నీచము. రెండవ ద్వారం మధ్యమం. ఈ నడక మంచిదే. మూడవ ద్వారం ‘ఉత్తర ఈశాన్యం’లో అమరుతుంది. ఈ ద్వారం చాలా శ్రేష్ఠమైంది. ఉచ్ఛమయినది. మంచి ఫలితాలను ఇస్తుంది, ధనవృద్ధి కలుగుతుంది.

ఒకవేళ ఇంటికి తూర్పున మూడు ద్వారాలు పెట్టాల్సి వస్తే-
ఒకటవ ద్వారం ‘తూర్పు ఈశాన్యం’లో అమరుతుంది. ఇది ఉచ్ఛము. శ్రేష్ఠము. కీర్తి ప్రతిష్ఠలు, వంశాభివృద్ధి కలుగుతాయి. రెండవ ద్వారం ‘మధ్యమం’ మంచిదే. మూడవ ద్వారం తూర్పు ఆగ్నేయం’లో అమరుతుంది. ఈ ద్వారం ఉండటం వలన కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి తూర్పు ఆగ్నేయ ద్వారా అమర్చుకోకపోవటం మంచిది.(vastu for home entrance)

vastu vastu correction vastu dosha vastu for home Vastu for Home Entrance

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.