ప్రశ్న: సాధారణంగా గృహానికి ఈశాన్యం పెరుగుదల ఉండాలి(పెంచాలి) అంటుంటారు కదా! గృహానికి ఈశాన్య పెరుగుదల సాధారణంగా ఎన్ని సెంటీమీటర్లు/అంగుళాలు పెరిగి ఉండాలి? గృహ విస్తీర్ణాన్ని బట్టి ఈశాన్యం పెరుగుదలలో మార్పు ఉంటుందా? ఉదా: 50 చ.గజాలలో గృహానికి 500 చదరపు గజాలలో కట్టిన గృహానికి ఈశాన్యం పెరుగుదలలో తేడా ఉండాలా? తెలుపగలరు.
జవాబు: స్థలం ఎంత వైశాల్యం కలిగివున్నప్పటికీ చతురస్రం/దీర్ఘ చతురస్రాకారం కలిగి వుండాలి. అలాంటిస్థలం నైరుతి దిశ కానీ, ఉత్తర, వాయువ్యంగానీ, తూర్పు (East) ఆగ్నేయంగానీ ఎట్టి పరిస్థితుల్లో పెరిగి ఉండకూడదు. నాలుగు మూలల్లో మూలమట్టానికి (90 డిగ్రీలు) కలిగి వుండాలి. ఎంత జాగ్రత్త పడినా ఏదైనా పొరపాటు జరిగినా పైన పేర్కొన్న దిక్కులకు ‘రవ్వంత స్థలం పెరిగినా అనర్థమే! అందువల్ల ‘ఆ దిక్కులు పెరగలేదు’ అని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. అందుకు అవలంభించే సులభమైన పద్ధతినే ‘ఈశాప్రాచీ’ అంటారు. మొత్తం స్థలం నాలుగు మూలలను మూలమట్టానికి సవరించిన తరువాత కూడా ఈశాన్య మూలన ఒకటి, రెండు అంగుళాలు పెంచుతారు. ఇలా చేయటం వలన ఆ స్థలానికి (place) తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరుగుతాయి. అయితే ఇక్కడ ‘ఈశాన్యాన్ని పెంచడం కంటే, పెరగకూడని దిక్కులు పెరగకుండా నిరోధించటమే’ ఈ పద్ధతి ముఖ్య లక్ష్యం. కానీ క్రమంగా ఈశాన్యం పెరగడం ప్రాముఖ్యం పెరిగింది. ఒక క్షేత్రానికి ఎంత ఈశాన్యం పెరిగితే అంత మంచిదన్న అభిప్రాయం బలపడుతూ వస్తున్నది. అంతేగానీ ఒక స్థలం/గృహం ఎంత వైశాల్యం కలిగివున్నప్పటికీ ఈశాన్యం కొన్ని అంగుళాలు పెరిగి ఉంటే చాలు.
పధ్నాలుగు లోకాలంటే?
ప్రశ్న: ఆకాశ గుణమయిన శబ్దం ఏడేడు పధ్నాలుగు లోకాలకు విస్తరించి వున్నదని మీరు చెప్పారు. ఆ లోకాలు ఏమిటి? వీటి పేర్లేంటి? శబ్దం ఎలా విస్తరింపబడింది? వివరించగలరు. పెంచాలి?
జవాబు: విశ్వంలో భూలోకానికి కింద వున్న లోకాలను ‘అధోలోకము’ అంటారు. అవి ఏడు: 1) అతలము 2) వితలము 3) సుతలము 4) తలాతలము 5) రసాతలము 6) మహాతలము 7) పాతాళము. భూమి, ఆపై వున్న ఆ లోకాలను ‘ఊర్ధ్వలోకము’ లంటారు. ఇవి ఏడు: 1) భూలోకం 2) భువర్లోకం 3) స్వర్గలోకం 4) మహాలోకం 5) జనలోకం 6) తపోలోకం 7) సత్యలోకం. ఇవి ఏడేడు (ఏడు+ఏడు) పధ్నాలుగు లోకాలు. వీటినే ‘చతుర్దశ భువనములు’ అంటారు. ‘అ’ కార ‘ఉ’ కార ‘మ’ కారములతో కూడిన ‘ఓం’కార శబ్దమయిన ‘ప్రణవనాదం’ చతుర్దశ భువనముల పర్యంతం విస్తరించిన తీరును మన పురాణ గ్రంథాలలో పేర్కొన్నారు.
ఇల్లు అమ్ముడు పోవడం లేదు..
ప్రశ్న: పడమర వీధి గల ఈ స్థలంలో తూర్పు భాగంలో ఇల్లు కట్టుకున్నాను. మిగతా సగం, పశ్చిమ రోడ్డు భాగం అమునమదామని నిర్ణయించుకున్నాను. ఆ స్థలం మీద అప్పులు కూడా చేసాను. రెండు సంవత్సరాలు అవుతోంది. ఇల్లు అమ్ముడు పోవడం లేదు. చుట్టుపక్కల ఇండ్లు, చక్కని పరిసరాలు, ఊరి మధ్యలో ఉన్నది. అడిగినవారు మరీ తక్కువ ధరకు అడుగుతున్నారు. ‘మళ్లీ వస్తాం’ అని చెప్పి రావడం లేదు. పరిష్కారం చెప్పగలరు.
జవాబు: స్వరూపరీత్యా ఇది పశ్చిమ వాయువ్యం పెరిగిన స్థలం. అధికమైన జనాదరణను కలిగించే స్థలం. మంచిది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే స్థలం, అమనమదగిన స్థలం కాదు. కానీ ఈ స్థలంలో తూర్పులో ఇల్లు కట్టి పడమర ఖాళీగా వదిలేయటం వలన వాస్తు దోషం ఏర్పడింది. అందువల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. మొత్తం స్థలానికి నైరుతి భాగంలో పడమర, దక్షిణ హద్దులనానుకుని 10×10 అడుగుల గది నిర్మాణం గావించండి. ఒక మెట్టు ఎక్కి గదిలోకి వెళ్లేలా ఉండాలి. ఉత్తర వాలుగా రేకులు వేయించండి. ఇల్లు అమ్ముడయ్యే అవకాశాలు పెరుగుతాయి.
Read also: hindi.vaartha.com
Read also: