Vastu effects on daily habits:ప్రశ్న: కొంతమంది వ్యసనాలకు గురువు ఉంటారు. అలవాట్లపై వాస్తు ప్రభావం ఉంటుందా? వాస్తు బాగా లేకపోతే ఇంట్లో ఉండేవాళ్లు వ్యసనాలకు లోనయ్యే అవకాశం ఉంటుందా?
జవాబు: ఉంటుంది. ఒక ఇంటికి వ్యసనాలు కలిగించే దోషం ఏదైనా ఉంటే ఆ ఇంట్లో ఉండేవాళ్లు వ్యసనాలకులోనయ్యే అవకాశం వంద శాతం ఉంటుంది.
ఏ ఇంటికైనా అల వ్యసనాల సమస్యకి ప్రధానమైన కారణం వాయువ్య దోషాలే! ఈ దిక్కు బాగుంటే మంచి ఫలితాలను ఇస్తుంది.
బాగా
లేకపోతే చెడు (bad) ఫలితాలను ఇస్తూ ఉంటుంది. వాయువ్యం దోషపూరితం అయినప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్లకి వ్యసనాలు, మానసిక (mental) సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. వాయువ్యానికి సంబంధించిన దిక్పాలకుడు వాయుదేవుడు.
వాయువు స్వతంత్రమైనది, చంచలమైనది. మనసు
కూడా చంచలమైనది. ఆ విధంగా వాయువ్యానికి మనసుకి సంబంధాన్ని కలపటం వాస్తు శాస్త్రంలో
ప్రస్తావించబడింది. ఉత్తర భాగంలో కొంత భాగం, పశ్చిమ భాగంలో కొంత భాగం కలిపితే వాయువ్యం దిక్కువ అవుతుంది. ఉత్తర, పశ్చిమ రెండుదిక్కులు కలిసే మూలని
‘వాయువ్య మూల’ అంటాం. వాయువ్యంలో సాధారణంగా ఉత్తర వాయువ్యం పశ్చిమ
వాయుష్యం అని రెండు భాగాలు ఉంటాయి
మంచి ఫలితాలను ఇచ్చేది పశ్చిమ వాయువ్యం. చెడు ఫలితాలను ఇచ్చేది ఉత్తర వాయువ్యం. దానికితోడు, అక్కడ దోషాలు కూడా అంటే ఉత్తర వాయువ్యానికి సంబంధించిన దోషాలు వుంటే ఆ దోషం వలన ఈ వ్యసనాలు కానీ, మానసిక
రుగ్మతలు కానీ గాలి సోకేటటువంటి ప్రతికూల ఫలితాలకు అవకాశాలు ఉంటాయి.
సాధారణంగా ఉత్తరం అంటే మనం కుబేర స్థానమని, బృహస్పతి స్థానం అని చెప్పుకుంటాం. కుబేరుడు ధనానికి ప్రతీక. బృహస్పతి అంటే నం. ధనం, జ్ఞానం ఈ రెండింటి కలయిక ఇది. ఇది ఏ విధంగా ఇంటిని ప్రభావితం చేస్తుందో అదే విధంగా ఆ ఇంట్లో వున్నవాళ్లు ప్రభావితం గావింపబడతారు.
ఉత్తర వాయువ్యంలో దోషాలను కలిగించే పరిస్థితులు ఏమిటంటే- ఉత్తర వాయువ్యం పెరిగి వుండటం. ఉత్తర వాయువ్యం పెరిగిందంటే, ఉత్తర ఈశాన్యం తగ్గింది.
అని అర్థం. దానివల్ల ధనానికి సంబంధించిన జ్ఞానానికి సంబంధించిన సమస్యలు ఉంటాయి. అలా పెరగలేదు, మామూలుగానే ఉందనుకోండి. దోషం లేదు కనుక ఇల్లు మామూలుగానేఉంటుంది.
ఇంట్లో ఉన్నవాళ్లు మామూలుగానే ఉంటారు. ఉత్తర వాయువ్యం నుంచి
ఏదైనా వీధిపోటు తగులుతుంటే, దాని వలన ఉత్తర వాయువ్యం ప్రతికూలంగా ప్రభావితం
చూపెడుతుంది. ఉత్తర వాయువ్య వీధిపోటువలన కూడా ఉత్తర వాయువ్య దోషం ఏర్పడి ఆ ఇంట్లో నివసించేవాళ్లకి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గాలి సోకటం’ లాంటి సమస్య ఇందులో ఒకటి. సెలెక్ట్ వాయువ్య వీధిపోటు వలన ‘నెగిటివ్ రిజల్ట్స్’ మొదలవుతాయి. అందువల్ల ఉత్తర
వాయువ్య దోషాలు ఉంటే వెంటనే సవరించుకోవాలి.
ఒక ఉత్తర వాయువ్యం పెరిగిన స్థలంలో నలు చదరపు ఇల్లు కట్టుకున్నా సరే.. ఆ స్థలానికి ఉత్తర వాయువ్యం పెరగటం వలన దోషం ఏర్పడుతుంది. పెరిగిన ఉత్తర వాయువ్యాన్నిసవరించుకోవడం వలన దోషం పోతుంది. ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూల ఫలితాలు మెరుగవుతాయి. అలాగే నేరుగా ఒక ‘వీధిపోటు’ ఉత్తర వాయువ్యానికి కాంపౌండ్ గోడకు తగిలితే దానిని ‘ఉత్తర వాయువ్య
వీధిపోటు’ అంటారు. కాంపౌండ్ గోడల లోపల ఉన్న ఇంటికి ఇది తగలవచ్చు, ఇటువంటి ఉత్తర
వాయువ్య వీధిపోటు ఆ ఇంట్లో ఉండే వాళ్లందరి మీద ప్రతికూలంగా పని చేయటం మొదలు పెడుతుంది. కనుక ఆ వీధిపోట్లు లేకుండా చూసుకోవాలి.
ఉత్తర వాయువ్య భాగం పెరగకుండా
చూసుకోవాలి. ఒకవేళ పెరిగి వుంటే సరిచేసుకోవాలి. ఉత్తర వాయువ్య వీధిపోటు వుంటే, దానిని తప్పించే విధంగా అంటే ఆ వీధిపోటును తప్పించి మనం ఇంటి స్థలాన్నిగానీ, ఇంటినిగానీ
సరి చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలి. వీధిపోట్లు ఉన్నాయని కంగారు పడవద్దు. వీధిపోటును సరి చేసుకోలేకపోతే, నియత్రించుకోవటానికి కొన్ని ‘ప్రత్యామ్నాయ పద్ధతులు’ ఉన్నాయి. వాటిని ఆచరించటం వల్ల చెడు ఫలితాలు క్రమంగా తగ్గిపోయి మంచి ఫలితాలు వచ్చే అవకాశం
ఉంటుంది.
Read also: hindi.vaartha.com
Read also: