📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

vastu: ఇల్లు వాస్తుకు అనుకూలంగా ఉందా?

Author Icon By Hema
Updated: July 31, 2025 • 4:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రశ్న: నేను, నా స్నేహితుడు గృహ నిర్మాణం చేసాం. రెండు ఇళ్ల మధ్యమూడు అడుగుల ఖాళీ స్థలం వదిలేసాం. పుణ్యావచనం చేసాం. కానీ ప్రస్తుతం ఈ ఇంట్లో వుండటం లేదు, అద్దెకు ఇచ్చాం. అద్దెకు వున్నవాళ్లు విధమయిన ఆర్థిక సమస్యలు వస్తున్నాయి. ఇంట్లో ఏమయినా
. వాస్తుదోషాలు వున్నాయేమోనని అనుమానంగా వుంది. మీరు మా ప్లాను పరిశీలించి ఏమయినా వాస్తుదోషాలు వుంటే తెలుపగలరు. ఇంటి వెనకాల వున్న ఖాళీ స్థలం (ఉత్తరంలో) అమ్మకానికి ఉంది. అది కొంటే ఇల్లు వాస్తుకు అనుకూలంగా వుంటుందా? లేదా? తెలుపగలరు.

జవాబు: vastu ఉత్తరంలో వున్న ఖాళీ స్థలం కొనుక్కోవచ్చు. లెట్రిన్ని నిర్మూలించి బాత్రూమ్కి దక్షిణం వైపు నిర్మించండి. ఇంటికి ఎంట్రన్స్ పశ్చిమ నైరుతిలో వుంది. అలా కాకుండా పశ్చిమ వాయువ్యంలోకి మార్చుకోవడం వల్ల మెరుగయిన ఫలితాలుంటాయి. కొన్ని ఇళ్లు గదుల(rooms) విభజనను బట్టి కిరాయిదార్లకు చాలామంచి ఫలితాలనిస్తాయి. కానీ స్వంతదార్లకు అంత మంచి ఫలితాలనివ్వవు. కొన్ని సందర్భాలలో ఇంటి యజమానికి చాలా మంచి(good)

ఫలితాలుంటాయి. కానీ కిరాయిదార్లకు మంచి ఫలితాలుండవు. ఇది చాలా మందికి అనుభవంలోకిరావటం సహజం. ఆ ఇండ్ల నిర్మాణాన్నినైసర్గిక స్వరూపాన్ని బట్టి ఫలితాలుంటాయి.

vastu

ఇంటి ఆవరణలో బాదంచెట్టు ఉండవచ్చా?

ప్రశ్న: మా ఇంటిని నిర్మించి రెండు సంవత్సరాలు అయింది. మాకు తెలిసిన వాస్తు ప్రకారం ఇల్లు కట్టాం. మా ఇంట్లో సెప్టిక్ ట్యాంక్లువున్న ప్రదేశాలు మాకు అనుమానంగా వున్నాయి. అదేవిధంగా ఇంట్లోఏమయినా పెద్ద చెట్టు వుండవచ్చా? వుంటే ఎక్కడ వుండాలి?తెలియజేయగలరు ఇంటిముందు బేస్మెంట్ ఖాళీ వుంది. ఆబేస్మెంట్ ముందు ఒక బాదంచెట్టు వుంది. అది వుండాలా? వద్దా?తెలుపగలరు. ఈ ఇల్లు కట్టినప్పటి నుండి మా అమ్మ అనారోగ్యంతో
వుంటోంది. దానికితోడు ఆర్థిక ఇబ్బందులు. ప్లాను చూసి దోషాలు ఏమయినా వుంటే తెలియజేయగలరు. ఉందా?

జవాబు: మీ ఇంట్లో రెండు సెప్టిక్ ట్యాంక్స్మెయిన్ గేటుకు సింహ ద్వారానికి మధ్యలో వున్నాయి. వాస్తులో రాజీ పడకూడదని విషయాలలో ఇదొకటి. ఈ సెప్టిక్ ట్యాంక్స్ని పూడ్చివేసి తలుపులోకి మెయిన్ గేటులోకి రాకుండా తూర్పు లేదా ఉత్తర భాగాలలో నిర్మించుకోవచ్చు. పెద్ద చెట్లు పశ్చిమ దక్షిణ దిక్కుల్లో, ఖాళీ స్థలాల్లో వుండవచ్చు. అసలు ఇంట్లో వుండకూడని చెట్లు కూడా ఎన్నో
వున్నాయి. బాదం చెట్టు వున్న చోట రాత్రిపూట గబ్బిలాలు తిరుగుతాయి. అవి ఇంట్లోకి కూడా వస్తుంటాయి. గబ్బిలాలు ఇంట్లో తిరగకూడదని శాస్త్రం చెబుతుంది. వాటి ఉనికికి కారణమయిన
బాదంచెట్టును ఇంటి ఆవరణలో, పరిసరాల్లోనూ వుండకూడదని నిర్దేశించింది అందుకే. ఆగ్నేయ
దోషం వల్ల కూడా మీరు పేర్కొన్నటువంటి దుష్ఫలితాలుంటాయి. పెరిగిన ఆగ్నేయ గదిలో వంట చేయటంకూడా ఆగ్నేయ దోషమే అవుతుంది కదా!. ఆ గది నిర్మూలన శ్రేయస్కరం.

అన్నదమ్ములం ఏయే పోర్షన్లో ఉండాలి?


ప్రశ్న: మేం ముగ్గురం అన్నదమ్ములం. మా ఇంటిప్లాను పంపిస్తున్నాను. ఆ ప్లాను ప్రకారం ప్రస్తుతం వుంటున్నాం. ఈ విధంగా వుండడం వల్ల మాకు ఏమీ బావుండటం లేదు. చాలా మంది ‘మీరు పద్ధతి ప్రకారం లేరని’ అన్నారు. తూర్పు ఆగ్నేయంలో ఒక వంటగది వుంది. అది కూడా సరిగా లేదు. ఆ వంటగది వుండకూడదు అంటున్నారు. కనుక మీరు సరయిన సలహా ఇవ్వగలరు.
జవాబు: తూర్పు ఖాళీ స్థలంలో ఆగ్నేయ మూలన, తూర్పు దక్షిణ కాంపౌండ్ గోడలను ఆనుకొని వంటగది నిర్మించకూడదు. ఆ స్థలాన్ని పూర్తిగా ఖాళీ స్థలంగానే వాడాలి. అందుకుగాను ఆ వంటగదిని నిర్మూలించి గృహం కట్టుబడి స్థలంలో ఆగ్నేయ మూలన తూర్పుకు అభిముఖంగా వంట చేసే ఏర్పాటు చేసుకోవాలి. ప్రస్తుతం పెద్దవాడు ఉత్తరాన, మధ్యవాడు దక్షిణాన, చిన్నవాడు మధ్య భాగంలో వుంటున్నారు. ఒకే కప్పు కింద మూడు పోర్షన్లలో ముగ్గురు అన్నదమ్ములు ఈ విధంగా నివసించకూడదు. పెద్దవాడు దక్షిణ పోర్షన్లో, మధ్యవాడు మధ్య పోర్షన్లో, చిన్నవాడు ఉత్తర పోర్షన్లో వుండటం వాస్తురీత్యా సరయిన పద్ధతి. ఈ విధంగా మీరు మార్పులు చేసుకొనివసించినట్లయితే మెరుగయిన ఫలితాలను పొందవచ్చు.

Read also: hindi.vaartha.com

Read also: vastu for home :శంకపాలక వేధ అంటే

#RentalHouseVastu VastuForHome VastuRemedies VastuTips WestFacingHouse

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.